వర్షం -- బాల్యం గుర్తులు;-డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
వర్షం వచ్చింది
పిలువని చుట్టంలా
కుండపోతగా కురుస్తుంది
గుండె చెరువయ్యేలా 

వాన తడిపింది నన్ను
లోన నా బాల్యం మెరిసింది
తడి తడిగా పొలం మొలకెత్తినట్లు

చినుకుల చిటపటలో
ఒక వరద గీతం పొంగింది
బడికి సెలవిస్తే ఆనందం ఆటైనట్లు

ఊరంటే ఉసికలో నానే వర్షమే
ఇసుకను గిన్నెలుగా చేసిన వాన
సైకత వేదిక ఈత కొలనై ఈదినట్లు

తడి ఉసిక నాలో గొప్ప బాల్యం
ప్రవాహామే ఎదురు నడక నేర్చింది
పిచ్చుక గూళ్ళైనవి ఇసుక పాదాలు

వానలో నేను
ఓ జల గీతాన్నీ పాడాను
ఓ వరద వెల్లువనూ దాటాను
బాల్యం బతుకు తడి అమూల్యం

వర్షం స్నేహాంకురాల హర్షం
వాన బాల్యం పాదముద్రల సంతకం  
బాల్యం కురిసిన వర్షంలో 
తడిసి మెరిసే ముత్యపు చిప్పన్నేనే

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Wonderful recollection of childhood experience of incessant rain.simple but wonderful poetic concept and thrilling images.Congrats to the Nature poet and Natural Piet Dr.Radhakrishnamacharyulu Saab