వరి నాట్లు సమ్మోహనాలు ;-ఎం. వి. ఉమాదేవి
వనితలతొ వరి నాట్లు 
నాట్లు వేసిరి ఇట్లు 
ఇట్లు వ్యవసాయమ్ము చేసేరు ఓ ఉమా !

నారు కట్టలు గట్టి 
గట్టిగా చేపట్టి 
చేపట్టి వరసలుగ నాటుదురు ఓ ఉమా !

మడమ లోతున నీరు 
నీటిలో మసిలేరు 
మసులుతూ మంచిపని అందుకొను ఓ ఉమా !

చిక్కు కున్నది పంట 
పంట వేయుట తంట
తంటయిన రైతన్న మానడే ఓ ఉమా !

మూడు నెలలకు సాగు 
సాగునే వరి పోగు 
పోగయిన వరికుప్ప మురిపించు ఓ ఉమా !

వంట చేసిన చేయి 
చేయి పంటలనోయి 
పంటలో కడవరకు వనితలే ఓ ఉమా !

కూలీల అన్నాలు 
అన్నములతొ  గంపలు 
గంపలో ఘుమఘుమల వడ్డించు ఓ ఉమా !

అరిటాకు భోజనము 
భోజనం సుందరము 
సుందరమె తాటాకు రేకలే ఓ ఉమా !


కామెంట్‌లు
చెలంచర్ల భాస్కర రెడ్డి చెప్పారు…
వ్యవసాయాన్ని మూడు ముక్కల్లో చెప్పినారు.
బాగుంది.మద్దినేల అన్నం తినేదానికి రేకలు కట్టుకోవడం గుర్తు చేశారు.