గోల్డ్ కోస్ట్ దేశం లో గినియాకోడి తన పొలం లో ఎంతో కష్టపడి ఒళ్లు వంచి పనిచేసేది.రకరకాల గింజల పంటలు దుంపలు అరటిపళ్ళు పండించి కమ్మగా తాను తిని ఇతరులకు పెట్టేది.కాస్త దూరంలో ఒక కుందేలు కి పొలం ఉంది కానీ మహా సోంబేరి.విత్తులు నాటేది కానీ వాటికి సక్రమంగా నీరు పెట్టడం కలుపుతీయటం చేసేదికాదు.గినియాకోడి పొలం ని చూసి ఈర్ష్య అసూయతో కుళ్ళుకునేది.తన భార్య పిల్లలతో కోడి పొలం లో చొరబడి ధాన్యం కూరగాయల్ని బుట్టలో నింపుకుని ఉడాయించేది."నాపొలంలోకి జబర్దస్తీగా చొరబడతావేంటి?" అని కోడి అడిగితే"ఇవినావి"
అని దబాయించేది.ఆరెండు బాగా పోట్లాడుకున్నాయి.తీర్పు కోసం గ్రామాధికారి దగ్గరికి వెళ్లాయి."ఈకుందేలు నేను కష్టపడి పండించినవి అన్నీ దొంగతనంగా ఎత్తుకుపోతోంది" గ్రామాధికారి అడిగాడు "కుందేలూ! నీకూరగాయల బండీ ఏదీ?""అదిగో!" కోడి అంది" నేను అన్నీ నానెత్తిన తట్టలో పెట్టి తీసుకుని వెళ్తా!" గ్రామాధికారి అన్నాడు "పొలం ఉన్న వారి కి బండి తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈపొలం కుందేలుదే!" పాపం కోడి ఏడుస్తూ ఇంటికి వెళ్లి పోయింది. కుందేలు పొలం లో పండినవి ఆశగా బండీలో వేసుకుని లాగుతూ బయల్దేరింది.కష్టపడి పని చేసే అలవాటు లేకపోవడం తో రొప్పుతూ ఒకచోట కూలబడింది."కుందేలు!నీకు సాయం చేస్తాలే!"అని చెప్పి అవన్నీ తట్టలో పెట్టుకుని నెత్తిన అమర్చుకుని రయ్ న తన ఇంటికి ఎగిరిపోయింది. కుందేలు గ్రామాధికారి దగ్గరికి వెళ్లి "కోడి నా సరుకంతా కాజేసి నెత్తిన పెట్టుకుని మాయమైపోయింది " అని ఘొల్లుమంది. ఇప్పుడు గ్రామాధికారి ఇలా అన్నాడు "నెత్తిన బరువులు మోసేవారి తలపై వెంట్రుకలు త్వరగా ఊడుతాయి.నెత్తిన జుట్టు పల్చ బడుతుంది. నేను మీతలలు తడిమి చూస్తాను " అని గినియాకోడి తల నిమిరాడు.దాని తల బోడిగా తగిలింది. "ఏయ్ కుందేలూ! ఏనాడూ నెత్తిన బరువు మోసిన దాఖలాలు లేవు. కోడి బరువులు మోస్తోంది కాబట్టి దాని ది బోడిగా తగుల్తోంది.నీవు ఉట్టి అబద్దాల పుట్టవి!" అనటంతో నోర్మూసుకుంది కుందేలు. దొంగతనం చేసి కూరలు బుట్టలో నింపుకునే కుందేలు నించి రివ్వున ఎగిరివచ్చి దాన్ని ఎత్తుకుపోతోంది కోడి. పైగా తన తోటలో కూరలు కోసేపని గింజలు ఏరేపని తప్పింది కోడికి.అందుకే అంటారు చెరపుకురా చెడేవని! తలదన్నే వాడుంటే తాడిదన్నే వాడుంటాడు సుమా 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి