అరుణోదయ సుప్రభాత తొలిసంధ్య వేళ... ఆరుబయట నేటి మహిళ... !
కట్టినవలువలనే... రెక్కలుగా మలచుకుని,స్వేచ్ఛావిహంగమై
జగతిన విహరించాలని....
మనసున తలచిన తలపులు
సాకారం కావాలని తనకోరిక ప్రకటిస్తోంది...
తన ప్రతిరూప మైన ప్రకృతితో... !
ఇరుసంధ్యలనడుమయే కాదు అహర్నిశలు
అవిశ్రాoతసేవల నందించినా...
ఆమెత్యాగనిరతిదయాగుణం గుర్తించనిఈలోకం
వివక్షతను చూపగా...,
తన ఔన్నత్యపు అస్తిత్వాన్ని...
నిరూపించుకునేందుకు
పోట్లాడేదౌర్భాగ్యపుసంకెళ్లను
త్రెంచుకొని...,
మా సహజ స్వేచ్ఛతో మేము
చేయలేనిదేమున్నది... !?
నింగిని చుంబించగలము
భువిని దివి గామార్చగలము!
మమ్మణగద్రొక్కచూడకండి...
విస్ఫోటనమై మేము వినాశనాన్ని చూపగలము !
చెప్పకనే చెబుతున్న నేటి మహిళ, తన భావాలను !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి