స్వేచ్ఛ-నానీలు; -సుమ కైకాల
1. కలం కదులుతుంది
    స్వేచ్ఛగా
    బహుశా చేస్తుందేమో
    అక్షరాల సేద్యం !

2. అమర వీరుల
    రక్తo చిందింది
    వినిపించాయి
    జెండా రెప రెపలు

3. స్వేచ్ఛoటే
    రెండక్షరాలు కాదు
    విహంగo దొరకదు
    ఎగిరిపోతుంది!

4. డెబ్బై ఐదేళ్ల
    వజ్రోత్సవం
    జనం గుండెల్లో
    స్వేచ్ఛా సందడులు!

5. అమ్మాయి స్వేచ్ఛ
    కాగితంలోనే
    పెరిగిపోతున్నాయి
    అత్యాచారాలు!

కామెంట్‌లు