సుప్రభాత కవిత ; -బృంద
 ఊహకు ఊపిరిగా
ఆశలకు  ఆహ్వానంగా
కోరికలకు కొంగుబంగారంగా
మమతలకు మనసు నింపేదిగా
అనుబంధానికి అర్ధం తెలిపేలా
అసంతృప్తులు రూపుమాపేలా
సంతోషం  వెల్లివిరిసేలా
కుంకుమ  వన్నెలు చిందేలా
నీలపు చీకటి చినబోయేలా
పచ్చని వెలుగులు పరిచేలా
వెచ్చని సుఖాలు వరమిచ్చేలా
కోటికాంతులతో కోటి కిరణాలతో
జీవకోటికి రక్షణగా వస్తున్న ఉదయానికి
ఇస్తున్న స్వాగతం..
🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు