శ్రీగాయత్రీ మాత...
వేదమాత సర్వ ధర్మసారం
ఇరువది నాలుగు దైవశక్తుల బీజాక్షరం!
శ్రీగాయత్రీ దేవీ...
పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం
భారతీయుల అపర అమృత వాహిని!
శ్రీ గాయత్రీ మంత్రోచ్చారణ...
పరమ శ్రేష్ట దాయకం
దేహం సహస్రాదినాడులు చైతన్యం!
నిత్య గాయత్రీ మంత్ర జపం ...
దుష్టశక్తులు దూరం తొలగు భయం
షట్చక్రాలు ప్రభావితం కుండలిని శక్తి జాగృతమౌ!
షోడశాదశ మంత్ర అధిష్ఠాన మూలశక్తి...
పరాశక్తి ప్రాణశక్తి కళాశక్తి విశ్వశక్తి విజయశక్తి
విద్యాశక్తితో మిలితమైన దైవశక్తుల దర్శనం!
ఆయుర్వేద విద్య విజ్ఞానం గ్రంధాలలో నిక్షిప్తం
విదేశీయులు కావ్యాలను సైతం తస్కరించిన వైనం
పరిశోధించి పాటించగ ఆరోగ్య ఆచారాలనేకం!
నీలధవళ కాంతితో ప్రకాశించు దేవి
పంచముఖ వరదాభయ హస్త కమలవాసిని
కాపాడ లేవా! శ్రీదేవీ! మము కరుణించగ రావా!
(దేవీ శరన్నవరాత్రుల మూడో రోజు గాయత్రీ దేవి దర్శనం సందర్భంగా)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి