అక్కినేని నటనలగని!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
 పంచపదులు
===========
అక్కినేని నాగేశ్వరరావు
సెప్టెంబర్ 20 అక్కినేని జయంతి శుభాకాంక్షలతో,
===================================
1. మూడు పాతికల జీవితం,
              వెండితెరకంకితము!
    నటనలో ఉన్నతం,
      భావితరాలకు ఆదర్శము!
   స్త్రీ పాత్రల నటన,క్రమంగా,
            అదో నటనా శిఖరము!
  సాంఘిక ,పౌరాణిక, జానపద,
                  పాత్రల వైభవము!
  అక్కినేని సినీ రంగాన, తరగని బంగారు గని, పివిఎల్!
2. "ధర్మపత్ని "అన్నపూర్ణ,
       నాగేశ్వరుడు నాస్తికుడు!
   నటన ఆస్తికి ,అపర,
       కుబేరుడై, పంచినవాడు!
  ఆయన రూపం ,జన,
సమ్మోహనం, దసరా బుల్లోడు!
  "అడుగులతో" ప్రేక్షకుల,
       గుండెల్లో గూడు కట్టాడు!
నిత్యం ఆయనకు జయంతి, తలచినంత పులకింతలు,
             పివిఎల్!
3. ప్రేమ బలహీనతై, అభిషేకం,
            చేసిన అద్వితీయుడు!    అభిమన్యుడు,నమ్మినబంటు,
          జయభేరి మ్రోగించాడు!
  కాళిదాసు ,జయదేవుడు,
           జక్కన గా గెలిచాడు!తుకారం ,బాటసారి,
    విప్రనారాయణై పిలిచాడు!
కవి కలం, గాయక గళం,
     వదనాన ప్రదర్శించాడు,
                               పివిఎల్!
4. ఫిలింఫేర్ అవార్డులు ,
          పద్మ విభూషణ్ గ్రహీత!
  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు,
              కళా ప్రపూర్ణ, విజేత!
   రఘుపతి, ఎన్టీఆర్ జాతీయ,
                 పురస్కార ఘనత!
  నటన ఉన్నంతకాలం,
   "నటసామ్రాట్"  పరిపూర్ణత!
ఆయన సంభాషణలు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతాలు,                  


5. సినీ పరిశ్రమ హైదరాబాద్,
                        తరలించాడు!
   ,సామాజిక స్పృహతో ,
           జీవితం సాగించాడు !
   విద్య విలువ తెలిసి,
      చేయూత అందించాడు!
  నటనలో "మనం"గా,
      చివరి వరకు శ్వాసించాడు!
వ్యవస్థ సుడిగుండాలు, రావాల్సింది మరో ప్రపంచం,
               అన్నాడు,పివిఎల్!
_________

కామెంట్‌లు
Unknown చెప్పారు…
మొత్తం నాగేశ్వరరావుగారి వ్యక్తిత్వాన్నినటనా వైదుష్యాన్ని ఇంతక్లుప్తంగా సమగ్రంగా వ్యక్తీకరించడం అధ్భుతం ధన్యవాదాలు,జోహార్లు.
PVSLశ్రీరామమూర్తి