సమయస్ఫూర్తి!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు టీచర్ క్లాస్ లో పాఠం చెప్తుండగా శివా కి ఎక్కిళ్లు రాసాగాయి."మంచి నీళ్ళు తాగు" అన గానే ఓపావుగ్లాసు తాగాడు.కొన్ని నిముషాలకే మళ్ళీ ఎక్కిళ్లు!టీచర్ ఏమీ పట్టించుకోకుండా పాఠం కొనసాగించింది.ఆగకుండా  ఆశబ్దం అలావస్తోంటే పిల్లలంతా శివానే చూడసాగారు. బోర్డు పై రాస్తున్న టీచర్ పెద్ద గా రంకెలేసింది"శివా!గెటౌట్!అంతా నించోండి.డిసిప్లిన్ తక్కువ ". ఆగావుకేకలకి క్లాసంతా  నిశబ్దం!ఇంతవరకు  నేను దేన్ని గూర్చి చెప్పాను?" ఒక్కరూ నోరెత్తలేదు. బైట శివా  ఎక్కిళ్లు కూడా హఠాత్తుగా  ఆగాయి."సిట్ డౌన్ " అంటూ టీచర్ బైట నించున్న శివా దగ్గరికి వెళ్లి వాడి వీపు బుగ్గలు నిమురుతూ"నీ ఎక్కిళ్లు ఆపటానికే నేను ప్రయోగించిన చిట్కా!" అని లోపలికి వచ్చి కూచోమంది.పిల్లలంతా ఒక్కసారి చప్పట్లు కొట్టారు. "దీన్ని  ఏమంటారు?" టీచర్ ప్రశ్నకి "సమయస్ఫూర్తి టీచర్ "అన్నాడు రోహిత్!"గుడ్! నిత్య జీవితంలో  ఇలా మనం ఉండాలి. పాముని చూసి బెంబేలు పడకుండా  పూర్వం రైతులు వంకరటింకరగా అంటే జిగ్ జాగ్ గా నడిచేవారు.పాము కనపడగానే  తలపాగా భుజం మీదున్న  ఉత్తరీయం దాని తలపై పడేసేవారు.కురుక్షేత్ర యుద్దం ప్రారంభానికి ముందు  ధర్మ రాజు  గబగబా రథం దిగి శత్రు సైన్యం వైపు వెళ్లి  భీష్ముడి కి ఇతర గురువులు  పెద్దలకి నమస్కరించి  వారి ఆశీస్సులు పొందాడు. విజయీభవ అని అంతా ఆశీర్వదించారు.అది అతని తెలివితేటలు సమయస్ఫూర్తి ని తెలుపుతుంది. ఇప్పుడు మనసైనికులు కొండలు గోతులు మంచుకొండలు తుఫానులు అన్నీ ఎదుర్కొంటున్నారు. సమయస్ఫూర్తి చాకచక్యంతో ఉంటారు  అనుక్షణం. డాక్టర్ కూడా  రోగి స్థితిని బట్టి ఆపరేషన్ సమయంలో ఏకాగ్రతతో తో పాటు సహనం సమయస్ఫూర్తి కల్గి ఉంటారు ". టీచర్ మాటలతో పిల్లలకు ఆపదం అర్ధం  బాగా బోధ పడింది 🌹
కామెంట్‌లు