చిన్నారి పిల్లలు(బాల గేయం);-ఎడ్ల లక్ష్మి
చిట్టి పొట్టి పిల్లలు
చిన్నారి గువ్వలు
అమ్మ ఒడి పాపలు
ఆటలాడే కూనలు

బడికి వెళ్లే బాలలు
చదువులోన వీణలు
దరువు తోడవారలు
వెలిగేటి జ్యోతులు

భారతమాత బిడ్డలు
బావి భారత పౌరులు
చక్కనైన పిల్లలు
రెక్కలిప్పిన పక్షులు

పైకి పైకి ఎగురుతూ
దేశ ఎల్లలు దాటుతూ
డేగ కళ్ళ చూపుతో
శత్రువు గుండెలో తూటాలు

అంతట అన్నిటిలో వారు
అన్ని విధులలో వారు
అణువున వినయముగా
నేటి పిల్లలే రేపటి పౌరులు


కామెంట్‌లు