చెట్టుకు ఒక్క నీటి చుక్క నిచ్చిన
చెట్టు అంతా సంతోషిస్తుంది
చెట్టు అంతా బ్రతుకుతుంది.
మనిషికి ఎంత రక్తాన్నిచ్చినా
మనిషి మారడు సంతోషించడు
మనిషి బ్రతకడెందుకు.,!!!!!?
భూమిని ఎంత దున్నిన మట్టి లో
మొక్క మళ్లీ మళ్లీ మొలుస్తూనే ఉంటుంది.
గాలినెంత పీల్చిన ఖాళీ కాదు.
నీరెంతా ఆవిరైన సముద్రం సగమవదు.!!?
రాతిని ఎంత తొలగించిన
మరోచోట పర్వతమవుతుంది.
పర్వతం ఎంత ఎత్తుకు ఎదిగిన
ఆకాశాన్ని అందుకోలేదు ఎందుకు.!!?
నక్షత్రం ఎంత వెలిగిన కిందికి దిగదు ఎందుకు.
మనిషి ఎంత ఎదిగిన మనసు మారదు ఎందుకు
గద్దె దించిన బుద్ధుడు కాడెందుకు.
మొద్దును ఎంత తుంచినా చిగురించూనెందుకు.!?
మేఘం ఎంత కురిసిన భూమి మునగదెందుకు
ఎంత దాహమేసిన ఉప్పు నీరు తాగలేమెందుకు
ఎంత చీకటినైనా చిరు దీపం తొలగించునెందుకు
మనిషికి ఎంత రక్తమిచ్చినా మారడేందుకు
చెట్టుకు చుక్క నీరిచ్చిన బ్రతుకునెందుకు
చెట్టు అంతా సంతోషించినెందుకు.......
చెట్టుకు ఆహారం మట్టి ఒక వరం
మనిషికి ఆహారం అహంకారం ఒక నరకం!!!?
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా శ్రీ శ్రీ కళావేదిక.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి