"కవిశ్రీ సత్తిబాబు" సప్తతి జయంతి--శంకరప్రియ., శీల.,-సంచారవాణి: 99127 67098
 👌కవన సేద్యము నందు
కృషీవలుడు.. కవిశ్రీ!
     స్థితప్రజ్ఞుడు.. కవిశ్రీ!
ఆత్మ బంధువు లార! (1)
👌సప్తతి వసంతముల
జయంతి మహోత్సవము!
      పర్వ దినము కవులకు!
ఆత్మ బంధువు లార!
        (ఆత్మబంధు పదాలు., శంకరప్రియ.,)
 👌"కవిశ్రీ సత్తిబాబు గారు.. అందరికీ ఆత్మీయుడు! స్నేహశీలి! వీరికి 70 ఏళ్ళు( సప్తతి) నిండి; "డిసెంబర్ 7వ తేదీన" 71వ సంవత్సరంలో అడుగుగిడు తున్నారు. ఈ సందర్భంగా "కవిశ్రీ సప్తతి జయంతి" మహోత్సవమును.. హైదరాబాదులో "మియాపూర్ సాహితీ మిత్రమండలి" ఆధ్వర్యములో కవిమిత్రు లందరు కలిసి నిర్వహించు చున్నారు! ఈ సందర్భము పురస్కరించుకొని; 'సప్తతి సంచిక'ను  ఆవిష్కరించు చున్నారు!
👌 సత్తిబాబు గారు 
జననము.. 07 -12 - 1952 సంవత్సరము! పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం తాలూకాలో   లంకల కోడేరు గ్రామము నందు శ్రీడేగల పోతురాజు, మహాలక్ష్మి దంపతులకు సుపుత్రునిగా జన్మించారు! బాల్యం లోనే మాతృ వియోగము వలన, తల్లి ప్రేమను పొందలేదు! అదే విధముగా, బంధువుల ఆదరణ లభించలేదు! అందువలన, అతనిని "కవిత్వ మనెడు తల్లి" చేరదీసింది!
👌మిత్రబృందం "కవి శ్రీ"  నామకరణము చేసారు! ముద్దు పేరు సత్తిబాబు! కనుక,  "కవిశ్రీ సత్తిబాబు" గా, వ్యవహరించారు!
లంకలకోడేరులో 11 వ తరగతి  (ఎస్ ఎస్ ఎల్ సి) వరకు చదివారు! అటుపిమ్మట, కాకినాడలో పి. ఆర్. జి. కాలేజ్ లోను; మిగిలిన చదువు పి. యు. సి. వరకు, డే కాలేజి మరియు బి. కాం  రాత్రి కాలేజి లోను  చదివారు! తరువాత, ప్రవేటు కంపెనీలలో ఉద్యోగము చేస్తూ; రచనా వ్యాసంగము కొనసాగించారు!
      🚩ఆటవెలది పద్యము
  👌కన్నతల్లి లేక కారుణ్య మెఱుగను! 
      మనసుయుండి గూడ మమత నెఱుగ!
       బంధు జనులు నుండి, బాంధవ్యము నెఱుగ! 
       కవన మాత సాకె కడకు నన్ను!
.. అని పేర్కొన్నారు, కవిశ్రీ సత్తిబాబు గారు!
👌"తెలుగు బిడ్డలార తెలివి గనుడి"! యనెడు మకుటంతో.. "నీతి శతకము"ను; "సత్తిబాబు మాట సత్యమిదియె!.". అను మకుటముతో  శతకమును 
"శబరి గిరీశా!"  .. మకుటముతో ఒక ఆధ్యాత్మిక శతకమును; "తత్త్వ బోధ", ఆధ్యాత్మిక అంశములతో 108 తత్త్వాలు వ్రాశారు, సత్తిబాబు గారు!
👌బాల్యము నుండి ఆధ్యాత్మికత అలవడినది! తల్లి లేకపోవడంవలన, మరియు,  బంధువుల నిర్లక్ష్యం వలన.. ఏకాకిగా జీవించారు! ఆ సమయ మందు.. అమ్మ కొలువులో ధ్యానము చేస్తూ; గాయత్రి మంత్రోపదేశము పొందారు!  అమ్మకు దగ్గరై, శ్రీవిద్య ఉపదేశము పొంది అమ్మ సేవలో తరించు చున్నారు!  
      "ఆధ్యాత్మిక ధోరణి", "నీతి శాస్త్రము" సంకలనము; "వేదాంత డింఢిమము" (విశ్లేషణ సంకలనము); "కవిశ్రీ చాటువులు", "శ్రీ వేంకటేశ్వర శతకము", "శ్రీ లలితా శతకము", "ఆత్మ ఘోష"  (తనలో తాను కావించిన వాగ్యుద్దము). మున్నగునవి: వీరి స్వీయ రచనలు.
👌వీరికి ఆధ్యాత్మిక మంటే..  ఇష్టము! వీరు వైష్ణవుడైనను, పరమ శివ భక్తుడను. శ్రీ వీరభద్ర ఉపాసన, శ్రీ విద్య ఉపాసన.. మున్నగు.. సాధనలు చేయు చున్నారు! "కవిశ్రీ" గారికి .. నచ్చిన, మెచ్చిన పద్య గురువులు..  శ్రీ కంది శంకరయ్య గారు,  శ్రీ చింతా రామకృష్ణా రావుగారు, శ్రీ ముద్దు రాజయ్య గారు.. మున్నగు వారు!  వీరి చిరునామా: 
 ⚜️సంచారవాణి: 80745 06521
బ్లాక్ 14  ఫ్లాట్  102. ప్రజయ్ సిటీ
మియాపూర్
హైదరాబాద్.. 500049.,
👌ఈ రోజు.. సప్తతి జయంతి జరుపు కొనుచున్న; కవిశ్రీ సత్తిబాబు గారికి! జన్మదిన శుభాకాంక్షలు! హృదయ పూర్వక శుభాభినందనలు!💐💐
 🚩ఆటవెలది
      👌జనులు మెత్తు రేని, జన్మధన్య మగును! 
         కవులు మెత్తు రేని, కావ్య మగును!
          బుధులు మెత్తు రేని, భువిని నేలగలదు!
          సత్తిబాబు సూక్తి! సత్య మగును! 
( రచన: కవిశ్రీ సత్తిబాబు.,

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
శుభాకాంక్షలు అభినందనలు, నమ్మసుమాంజలి