నీచ బుద్ధి;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 వేమన ఏ కాలం వాడు, ఏ కులం వాడు ఎక్కడ నివసించాడు అనేది ఎవరికి ఏ ఆధారాలతో చెప్పిన దాఖలాలు దొరకలేదు  అయినా ఉజ్జాయింపుగా ఏడవ శతాబ్దంలో నివసించిన వాడై ఉండవచ్చును  అని వారి పద్యశైలిని బట్టి  కొన్ని ఆశతాబ్దంలో వాడిన శబ్దాలను  ఆధారం చేసుకుని  ఈ నిర్ణయం తీసుకున్నారు  ఏది ఏమైనా వేమనకు ముందు కానీ తరువాత కానీ ఆయన సమయంలో కానీ  మానవుని బుద్ధి ఒకే రకంగా పనిచేస్తూ ఉంటుంది  పెద్దలు చెప్పినట్లు  సాత్విక రాజస తామసాలు తప్ప మరొక దానికి తావులేదు  ఎదుటివారి బలాన్ని చూసుకొని  తన మనోబలాన్ని పెంచుకునే  దురాత్ములు కొందరు ఆ రోజునా ఉన్నారు  ఈ రోజున కూడా మనం కళ్లారా చూస్తున్నాం  ప్రభుత్వ అధికారులలో ఉన్న వారి  స్నేహంతో  అమాయకుల భూములను ఆక్రమణ చేస్తున్నవారు  వాటిని నాశనం చేస్తున్నవారు  మనకు కనిపిస్తూనే ఉన్నారు. వీరు చేస్తున్న అకృత్యాలను  అడ్డుకునేవారు  వారి పరిసరాలలో ఎవరో ఉండరు  ఎవరైనా ఒకరిద్దరున్నా  అవతలివాడి బలగాన్ని చూసి  ముందుకు వచ్చే ధైర్యం చేయరు  అసలీ ప్రపంచంలో ఇలాంటి చెడ్డవారి సంఖ్య  7-8 శాతానికి మించదు.  అయినా అంత అల్ప సంఖ్యలో ఉన్న వారిని చూసి  ఇంతమంది భయపడడం ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది  దీనికి కారణం ఎవరికి వారు భయపడటం అనేది కాకుండా  వీరిలో ఐక్యత భావం లేకపోవడం  అని పెద్దల సుద్ధి  అయితే ఈ అక్రమాలు దౌర్జన్యాలు  ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తికి తెలియకుండా ఉంటుందా  తెలిసినా ఊరుకుంటుందా  ప్రతీకారం చేయదా  అన్నదానికి సమాధానంగా  ఈ అమాయకుల ఉసురు  తగలకపోదు అని వేమన చెబుతున్నారు  మరి అది  అతీత శక్తికి అసాధ్యమైనది కాదు కదా. దానికి వేమన చక్కటి ఉపమానం చెబుతున్నారు  మనం సామాన్యంగా పిల్లలు బయట ఆడుకోవడం చూస్తుంటాం  ఎక్కువమంది చిన్నచిన్న బంతులను తీసుకొని  వాటిని పైకి ఎగరవేస్తూ  తిరిగి పట్టుకొని మళ్ళీ ఎగరవేయడం అదొక ఆట  ఆ బంతిని పైకి ఎగరవేసినప్పుడు ఎంతసేపు ఆ గాలిలో ఉంటుందా బంతి  క్షణాలలో తిరిగి  ఈ బాలుని చేతులకు వచ్చేదే కదా  దాని ఉనికి ఆకాశంలో  ఇలాంటి దుష్టులు నీచులు చేసే పని కూడా  ఆకాశంలో ఉన్న బంతిలాగా  కొన్ని క్షణాలు కాకపోతే కొన్ని రోజుల కైనా  కింద పడి అవమానాల పాలు కావడం తప్పదు. కనుక నీతికి నియమానికి కట్టుబడి  సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంచుకొని  బుద్ధిగా మంచిగా బ్రతకమని  వేమన చెప్తున్న నీతి  వారు రాసిన ఆట వెలదిని  ఒక్కసారి మననం చేయండి.

"భూపతి కృప నమ్మి భూమి జెరుచువాడు  
ప్రజల యుసురు దాకి పడును పిదప  నెగురవేయు బంతి యందాక నిల్చురా..."కామెంట్‌లు
ఆయుర్వేద బాపయ్య చెప్పారు…
మానవతావాదంలో మనిషి తనను తాను ఎప్పుడు నీతివంతంగా తీర్చిదిద్దుకుంటూ సామాజిక హితమును సాయమును లౌకికమును ఆనందిస్తూ ముక్తి పొందాలి అదే పరమార్ధం.
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం