బ్రహ్మ, నారద సంవాదంలో.....
గణేశ, కార్తికేయుల బాలలీల - వివాహ విషయం పై వివాదం - భూప్రదక్షిణకు శివ ఆజ్ఞ - గణేశ అశక్తత - తల్లిదండ్రులకు ప్రదక్షిణ - అదియే పృథివీ ప్రదక్షిణగా శివుని ఒప్పుదల - గణేశుని వివాహం - కుమారస్వామి పృథివీ ప్రదక్షిణ పూర్తి చేసి వచ్చి క్రౌంచపర్వతమునకు వెళ్ళడం - కుమారఖండ శ్రవణ ఫలము.
*"తండ్రీ! సురేశ్వరా! మీరు నా మీద ప్రేమతో, గణేశుని జన్మ వృత్తాంతము, గణనాయక పదవి గణేశునికి లభించడం వివరించారు. ఆ తరువాత ఏమి జరిగింది. శివపార్వతుల కీర్తి కథలు ఎన్ని విన్నా తనివి తీరదు కదా! మహాత్మా!" అని నారదుడు, బ్రహ్మ ను అడిగాడు.*
*నారదా! నీవు ముని శ్రేష్టుడవు. ఎప్పుడూ అందరి క్షేమమునే కోరుకుంటూ ఉంటావు. ఇప్పుడు కూడా, సకల జనుల మంచి కోరి నీవు వినగోరిన శివాశివుల కథను చెపుతాను విను. కార్తికేయుడు, గణేశుడు ఒకరిపై ఒకరు ప్రేమ ఆదరము కలుగి ఉండి, శుక్ల పక్షము నందు చంద్రుని లాగా దిన దిన ప్రవర్ధమానం అవుతున్నారు. యుక్త వయసు కూడా వస్తోంది. తమ కుమారుల ఎదుగుదల చూస్తూ పార్వతీ పరమేశ్వరులు ఎంతో మక్కువ పడుతూ, ముచ్చటగా సంతోషాన్ని అనుభవిస్తున్నారు. ఒకనాడు, ఉమ శంకరునితో కుమారుల వివాహ ప్రస్తావన చేస్తుంది. "స్వామీ! మనకు గణేశ, కార్తికేయులు ఇద్దరూ సమానమే కదా! ఎవరి వివాహం ముందు చేయాలి. ఇద్దరిలో ఎవరికి ముందు చేసినా, రెండవ వారు బాధపడతారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనండి, స్వామీ!" అని అంబ ప్రార్ధించింది.*
*తల్లిదండ్రులు మనసులో అనుకుని, చర్చించుకోగానే, కుమారులకు కూడా వివాహం చేసుకోవాలి అనే ఆలోచన వారి మనసులో వచ్చింది. షణ్ముఖ, గణపతులు ఇద్దరూ తల్లిదండ్రుల వద్దకు వచ్చి, భక్తి తో ప్రదక్షిణ చేసి నమస్కరించి, "జగన్మాతా పితరులారా! మీకు అనేక నమస్కారాలు. మాకు యుక్త వయసు వచ్చినది కనుక, మాకు వివాహ కార్యక్రమం జరిపించండి" అని ప్రార్ధించారు. కుమారస్వామి ముందు నాకు చేయమంటే, గణపతి కాదు నాకు చేయమని వివాదం లోకి దిగారు, కుమారులు ఇద్దరూ. అప్పుడు, శివాశివులు వారిద్దరినీ చూసి, "మీ వివాహం విషయంలో, మేము ఒక ఆలోచన చేసాము. అది మీ ఇద్దరికీ కూడా మంచి చేస్తుంది. కనుక, మేము చెప్పిన మాట విని అనుసరించండి" అని ఇంకా ఇలా చెప్పారు. "మీరు ఇద్దరూ కూడా సముద్రములతో, స్తద్వీపములతో కలసి ఉన్న ఈ భూమండల ప్రదక్షిణ చేసి ఎవరు ముందు వస్తారో వారి వివాహం ముందు జరిపిస్తాము. రెండవ వారి వివాహం తరువాత జరుగుతుంది" అని చెప్పారు.*
*తల్లిదండ్రుల ఆజ్ఞను విన్న కార్తికేయుడు వెంటనే తల్లిదండ్రుల కు నమస్కరించి భూ ప్రదక్షిణకై తన ప్రయాణం మొదలు పెట్టాడు.
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి