బ్రహ్మ, నారద సంవాదంలో.....
గణేశ, కార్తికేయుల బాలలీల - వివాహ విషయం పై వివాదం - భూప్రదక్షిణకు శివ ఆజ్ఞ - గణేశ అశక్తత - తల్లిదండ్రులకు ప్రదక్షిణ - అదియే పృథివీ ప్రదక్షిణగా శివుని ఒప్పుదల - గణేశుని వివాహం - కుమారస్వామి పృథివీ ప్రదక్షిణ పూర్తి చేసి వచ్చి క్రౌంచపర్వతమునకు వెళ్ళడం - కుమారఖండ శ్రవణ ఫలము.
*నారదా! సప్త ద్వీపాలు, సప్త సముద్రలతో ఉన్న ఈ భూమండలము యొక్క ప్రదక్కిణ ముందుగా పూర్తిచేసి వచ్చిన వారి వివాహం ముందు జరుపుతాము అన్న తల్లిదండ్రుల ఆజ్ఞను విన్న కార్తికేయుడు వెంటనే తల్లిదండ్రులకు నమస్కరించి, భూ ప్రదక్షిణకై తన ప్రయాణం మొదలు పెట్టాడు. అయితే, అన్ని బుద్ధులకు ఆది దేవుడు, అధిపతి అయిన గణపతి, తల్లిదండ్రులు అయిన శవాశివుల వద్దకు వెళ్ళి, నమస్కరించి, "అమ్మా, నేను ప్రత్యేకంగా మీ ఇద్దరినీ పూజించాలని ఏర్పాట్లు చేసుకున్నాను. నన్ను అనుగ్రహించి, పూజకు అనుమతి ఇవ్వమని" ప్రార్ధించాడు. కుమార గణేశుని విన్నపం విన్న పార్వతి, శివాజ్ఞ తీసుకుని, గణపతికి సమ్మతి తెలిపింది. ప్రత్యేక మందిరం లో తమ కొరకు వుంచిన ఉచితాసనముల మీద కూర్చున్నారు, పార్వతీ పరమేశ్వరులు. షోడశోపచార పూజ సశాస్త్రీయంగా పూర్తి చేసి, గణపతి తల్లిదండ్రులకు ఏడుమార్లు ప్రదిక్షణము చేసి, అనేక నమస్కారులు చేసి, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, నైవేద్యం సమర్పించి, వారి ఎదురుగా వచ్చి నిలబడి, "తల్లిదండ్రులారా! ఇప్పుడు నాకు వివాహము జరిపించండి" అని అడిగాడు.*
*గణేశుని మాటలు విన్న శంభుడు, "కుమారా! భూ ప్రదక్షిణ చేసి ముందు వచ్చిన వారికి కదా! మేము ముందు వివాహం చేస్తామని చెప్పింది. నీవు మా దగ్గరే ఉండి, మాకు ప్రదక్షిణ చేసి, నీ వివాహం ముందు చేయమంటావేమిటి?" అని ప్రశ్న వేసారు, అనంతుడు, అదిమధ్యాంత రహితుడు, సర్వ గుణ సంపన్నుడు, అన్ని బుద్ధులకు ఆద్యుడయిన సర్వేశ్వరుడు. అప్పుడు, గణపతి, "తండ్రీ! ఈ జగత్తు లో నీకు తెలియని, శాస్త్రము, వేద వాక్కు, లోకాచారములు ఏమైనా వున్నయా. అయినప్పటికీ, నానుండి వినాలని మీరు అడిగారు. కనుక, వినండి.*
*"మీరు ధర్మ స్వరూపులు, సర్వశ్రేష్టులు, మహాధీమంతులు. నేను, మీకు, మిమ్మల్ని స్మరిస్తూ ఏడు సార్లు ప్రదక్షిణ నమస్కారాలు చేసాను. ఇప్పుడు, ఈ ప్రశ్న ఏమిటి?" అన్నాడు ఏకదంతుడు. దానికి పార్వతీపతి, "కుమారా! నీవు సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు, పర్వతాలు కలిగిన భూ మండలాన్ని ఎప్పుడు చుట్టి వచ్చావు, నాయనా!" అని అడిగారు. "తల్లిదండ్రులకు పూజలు చేసి, ఏడు సార్లు ప్రదక్షిణలు చేస్తే, భూప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుంది అని వేదాలు, ఋక్కులు, చెపుతున్నాయి. ఆ ప్రకారం నేను మీ పూజ చేసి, ప్రదక్షిణలు చేసాను. కనుక, నాకు భూ ప్రదక్షిణ ఫలితం లభిస్తుంది. తల్లితండ్రలను ఇంటి వద్ద వదలి, తీర్థయాత్రలు చేసినా ఏమీ ఫలం చేకూరదు. తల్లితండ్రుల పాదాలే అన్ని తీర్థాలకు నెలవులు. ఆ పాదాల దగ్గర త్రివేణీ సంగమ ప్రదేశంలో స్నానం చేసిన ఫలితం అందుతుంది. ఇప్పుడు, నేను, భూ ప్రదక్షిణ చేయలేదు అని మీరు అంటే, వేద వాక్కు అసత్యం అవుతుంది. వేదాలు, మీనుండే వచ్చాయి. కనుక, మీరు అసత్యం అవుతారు. నా తల్లిదండ్రులు అయిన మీరిద్దరే ధర్మ స్వరూపాలు. మిమ్మల్ని మించిన ధర్మం లేదు. అందువలన, బాగుగా ఆలోచించి, నేను చేయ వలసిన భూ ప్రదక్షిణ పూర్తి అయినదా, లేదా నిర్ణయించండి" అని అడిగాడు గణేశుడు.
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి