అమ్మ భాష
అమ్మ పుట్టిన భూమి భాష
అమ్మ భాష
అమ్మ బతికిన భూమి భాష
అమ్మ భాష
అమ్మ కట్టిన ఇల్లు భాష
అమ్మ భాష
అమ్మ పెంచిన కుటుంబం భాష
అమ్మ భాష
అమ్మలే పోషించి పెంచిన సముదాయం భాష..
అమ్మకు వందనం
అమ్మ భాషకు అభివందనం.
అమ్మలనూ బతికిద్దాం
అమ్మ భాషనూ బతికిద్దాం
అమ్మలనూ కాపాడుదామ్
అమ్మ భాషనూ కాపాడుదామ్..
కాపాడుదాం.. కాపాడుదాం.. అభివృద్ధి చేద్దాం.
అందరికీ చేర వేద్దాం..
మాట్లాడుదాం అమ్మ భాషలో మాటలూ..
కవితలు రాద్దాం
కథలే రాద్దాం..
నాటక నాటిక హాస్యం రాద్దాం..
ఊకొట్టు కథలూ
జోకొట్టు కథలూ
ఊరడించు కథలూ
ఉయ్యాల కథలూ..
ఉయ్యాల పాటలూ
జంపాల పాటలూ..
ఎన్నో.. ఎన్నో.. ఎన్నెన్నో..
అమ్మకు జే జే
అమ్మ భాషకూ జే జే ..
===============
* అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు 🌹🌹🌹🪂🪂🪂🪂🤗
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి