కవి సమ్రాట్ (3);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 విశ్వనాథ సత్యనారాయణ గారు ఏది చెప్పదలుచుకున్నా నిర్ద్వందంగా మొహం మీద చెప్పగలిగిన ధైర్యశాలి  ప్రఖ్యాత సినీ నటులు ఎన్టీ రామారావు గారు విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుతున్న సమయంలో  విశ్వనాథ వారు వారి గురువు కనుక రామారావు గారు  విజయవాడలో తన సినిమాలు ఏ సినిమా శత దినోత్సవాలు జరిగిన దానికి ప్రత్యేకంగా  ప్రత్యేక ఆహ్వానితుడిగా విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చి చేరవలసినదే  ఆడబ్రతుకు రామారావు గారు చేసిన సినిమా వంద రోజులు పండగ చేసుకున్న సందర్భంగా విజయవాడలో  లక్ష్మీ టాకీస్ లో  ఏవీఎం అధినేత  మెయ్యప్పన్  జెమిని అధినేత వాసన్  ఆకాశవాణి నుంచి ప్రయాగ నరసింహ శాస్త్రి  లాంటి మేధావులు అంతా హాజరయ్యారు. వేదిక పైకి రాగానే ప్రక్కనే కూర్చున్న దేవిక వస్త్రధారణ చూశారు.అది వారికి నచ్చలేదు  అధ్యక్ష ఉపన్యాసంలో నాకు సినిమాలు చూసే అలవాటు లేదు  నా మనవరాలు, ఈ మనవరాలు ఈ సినిమా చాలా బాగుంది చూద్దాం అని గోల చేస్తే వచ్చాను చూసిన తర్వాత ఈ సినిమాలో నాకు కుక్క చేసిన నటన అద్భుతంగా నచ్చి ఈ సినిమాలో నాకు నచ్చిన పాత్ర కథానాయక  వస్త్రధారణ, ప్రవర్తన, సనాతన ధర్మాన్ని పుణికి పుచ్చుకున్న స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉంది  నాకు చాలా బాగా నచ్చిన విషయం ఆమె వస్తుందేమో చిన్నపిల్లగనక అభినందనలు  తెలియచేయవచ్చు అన్న  అభిప్రాయంతో ఇక్కడకు రావడానికి అంగీకరించాను.  అందులో వీడు (ఎన్టీరామారావు గారు) బలవంతం చేసి తీసుకొచ్చాడు  అయితే నేను ఎందుకు వచ్చాను అది జరగలేదు  రామారావును ఉద్దేశించి ఏరా ఆ అమ్మాయి రాలేదా అని అడిగారు. అదేంటి గురువుగారు హీరోయిన్ కదా ఆమె లేకపోతే ఎట్లా మీ పక్కనే కూర్చున్నది కదా ఆమే కథానాయక అని సమాధానం చెప్పారు  ఏరా నాతోనే అనృతములా ఈ వేషధారణ ఏమిటి  స్తన ప్రదర్శన ఏమిటి  ప్రేక్షకులకు చేపించడానికా  ఆ జుట్టుఏమిట్రా  గుర్రం తోక లేక  అలా వదిలేసింది అంటూ అనవలసిన మాటలు అన్నీ అన్నారు. దేవిక కన్నీరు పెట్టుకొని ఏదో చెప్పడానికి లేవబోతే వద్దని వారించారు ఎన్టీ రామారావు గారు అంటే సాయంత్రం ప్రత్యేక ఆహ్వానితుల సభ జరిగింది దాన్ని కూడా విశ్వనాథ వారు హాజరయ్యారు.  దేవిక చక్కగా చీర సింగారించుకొని జడవేసి సనాతన స్త్రీ పద్ధతిలో  సినిమాలో ఎలా వస్త్రధారణ ఉందో అలా తయారై వచ్చింది  వచ్చి ముందు విశ్వనాథ సత్యనారాయణ గారికి పాదాభివందనం చేసి నన్ను క్షమించండి గురువుగారు ఇంకెప్పుడూ అలా రాను అని చెప్పింది.



కామెంట్‌లు