ఏ దైవాన్ని శ్రీవిష్ణువు సదా స్మరించాడో!ఏ దివ్యరూపాన్ని శ్రీకృష్ణుడు సదా ధ్యానించాడో!ఏ ఇలవెలుపుని శ్రీరాముడు సదా ఆరాధించాడో!ఆ సదానంద నిత్య సత్య స్వరూపుడులోకాతీత త్రిగుణా తీత నిరంజనుడు శివుడు!ఎవరికై శ్రీకృష్ణుడు ఘోరంగా తపస్సు చేశాడో!ఎవరిని శ్రీరాముడు భూలోకాన ప్రతిష్టించారో!విష్ణువు నెవరు సిద్ధి కారకుడిగా నియమించారో!సకల సిద్ధ గురువులకు ఆది గురువెవరో...ఆ పరంధామ జగద్గురు జ్ఞాన సాగరుడు హరుడు!ఎవరు సకల ప్రాణులకు ఆధారమో!ఎవరు జ్ఞాన సుఖ పూర్ణ స్వరూపుడో!ఎవరు స్వయంభువు సకల వేద సారమో!ఈ విశ్వంలో అణువణువు వ్యాపించిన దెవరో!ఎవరి చెంత జగమే మాయనే సత్యం గ్రహిస్తారో!ఆ సదానంద పరమ లింగ స్వరూపుడు శివుడుపరంజ్యోతి పరాత్పర కాలాతీతుడుఆది అంతాలు లేని అనంత అవ్యక్త రూపుడునిర్గుణ నిరాకార శాంత స్వరూప ఈశ్వరుడు!ఆకాశ వైశాల్యం కొలువ వచ్చునేమో!అమరేశ్వరుని ఆది అంతం కనుగొనగలమా?మార్గదర్శకుని గుణగణాలు వర్ణించ గలవేమో!మహిమాన్విత మహేశ్వరుని మహా వైభవంజగదీశుని దివ్యభవ్య గుణం సరిపోల్చ గలమా?శివుడంటే శుభం కల్గించేవాడుశివుడంటే సర్వ దోష రహితుడుశివుడంటే పరమ శుద్ధాత్మ స్వరూపుడుశివుడంటే సకల కళ్యాణ గుణ స్వరూపుడుఅమృతమయ దివ్యశక్తి ప్రసాదించేవాడు!సకల దేవతల దేవాది దేవుడుఅణువణువు రుద్రుడు కొలువై వున్నాడుసూరీడు నుంచి ఊష్ణం విడదీయ వచ్చేమోచంద్రుడి చల్లదనం విడదీయ గలవేమోఅర్ధనారీశ్వర ఆది దంపతుల విడదీయని బంధం!వైద్యుడు లేక రోగులు దుఖించునట్టూసూర్యుడు లేని లోకం చీకటి మయమైనట్టూపరమ శివుడు లేని విశ్వం తమో మయంఈ చరాచర సృష్టి శివునిచే పరివ్యాప్తం!ప్రణవ పంచాక్షరి మంత్రం పఠించి తరించుదాం!🔱🔱🔱🔱🕉️🔱🔱🔱🔱
నిర్గుణ నిరాకార శాంత స్వరూపుడు; - కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్య పర్యవేక్షకులు, 8555010108.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి