వేమన చెప్పే నీతులన్నీ బహు విచిత్రంగా ఉంటాయి దానం చేయడానికి నీవెవరు దానిని సృష్టించిన వాడిలా అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఒకసారి మరొకసారి దానాన్ని మించిన గుణం మరొకటి లేదు కనుక నీ అవసరాలకు మించి నీ దగ్గర ఉన్న కొద్దిపాటిదైనా ఇతరుల అవసరాలను చూసి వాడికి ఇవ్వడం సమంజసము అని చెప్తాడు. ఈ పద్యంలో ఆయన చెప్తున్న విషయం దానం చేయడం చాలా గొప్ప పని అని ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి సహాయం చేయడం అనేది మానవ ధర్మం మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు అలా చేస్తూనే ఉంటాడు అన్నదానం అని కొంతమంది వాడుతారు అన్నదానం చేయడానికి అతను ఎవరు అన్న ప్రసాదము ఆకలితో ఉన్న వాడికి అన్నాన్ని ప్రసాదంగా అందిస్తున్నటువంటి వ్యక్తిని అని చెప్పుకోవాలి తప్ప దాతను అని చెప్పుకోవడం తగదు.దానమును మించి నీకు సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేది ధ్యానం మనసులో ఎవరిని కేంద్రీకరించి చెప్పాలని అనుకుంటున్నావో ఆ శబ్దాన్ని మనసులో ఉంచుకొని ఏకాగ్రతతో దానిపైనే దృష్టి ఉంచి అంకిత భావంతో చేస్తే నీకు ఎలాంటి అవాంతరాలు జరగవు అయితే ధ్యానం చేసేటప్పుడు వాతావరణం వల్ల కానీ మరే కారణ వలన అడ్డంకులు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి తప్ప దానికి లొంగి పోతే నీ ధ్యానం వృధా అలా చేయగలిగిన వాడికి దానం కన్నా ధ్యానం గొప్పది దీనిని మించినది మరొకటి ఉన్నది. నీ జీవిత పథాన్ని నిర్దేశించేది నిన్ను ముందుకు నడిపించేది నీ జ్ఞానం జ్ఞాన సంపత్తి లేని ఏ వ్యక్తి ఏ కార్యాన్ని చిత్తశుద్ధితో చేయలేదు కనుక ఆ జ్ఞానాన్ని సంపాదించడం కోసం పుస్తకాల ద్వారా గురువుల ద్వారా ఎంత నేర్చుకుంటే అంత గొప్ప వాడివి అవుతావు. అసలు వీటన్నిటికీ కారణం ఏమిటి మనిషి వస్తుతః ఆశపోతు కదా మనసులో ఎన్నెన్ని ఆశలు పుడతాయో దానిని సాధించడానికి ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయని నీ మనసు చెపుతుందో అవన్నీ చేస్తూ జీవితాన్ని నరకం చేసుకోవడం కన్నా ఈ దానం జ్ఞానం విజ్ఞానం అన్ని నీ సొంతం చేసుకోవాలి అనుకుంటే నీ మనసును నీవు అదుపులో ఉంచుకొని ఎలాంటి కోర్కెలకు లొంగకుండా ఎలాంటి దృశ్యాలను చూసినా వాటిని నా సొంతం చేసుకోవాలి అన్న దుర్బుద్ధికి వెళ్లక వేద విదులు ఎలాంటి సరైనా మార్గాన్ని అనుసరించారు అలాంటి మార్గాన్ని కానీ నీవు సొంతం చేసుకున్నట్లయితే మీ కుటుంబం నీవు జీవితాంతం సుఖ సంతోషాలతో ఆనంద ఉత్సాహాలతో జీవిస్తావని వేమన చెబుతున్నాడు. ఆ విషయాన్ని గమనిస్తూ వేమన రాసిన పద్యాన్ని కూడా చదవండి.
"దానమొసగు కన్న దేనంబు మరిహెచ్చు
దేన మొసగు కన్న తెలివి వ
హెచ్చు
తెలివి కన్న నానా డెగవేసినది
హెచ్చు..."
"దానమొసగు కన్న దేనంబు మరిహెచ్చు
దేన మొసగు కన్న తెలివి వ
హెచ్చు
తెలివి కన్న నానా డెగవేసినది
హెచ్చు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి