అహం!అచ్యుతుని రాజ్యశ్రీ

 నేనేగొప్ప నేనే తెలివిగలవాడినని అహం పనికిరాదు. ఎవరిగొప్పవారిదే!దేవుడి సృష్టిని తిరస్కరించటం హేళన చేయడం చాలా తప్పు. బలవంతమైన సర్పం చలిచీమలచేత చిక్కి చస్తుంది.
ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయి.పక్షులు మేము ఆకాశంలో ఎగరగలమని తలెగరేశాయి.నీటిలో బతకగలమని చేపలు తాబేళ్ళు బడాయిపోయాయి.ఇంతలో వేటగాళ్ల తుపాకీ మోతతో ఎక్కడవక్కడ పారిపోయాయి అడవి జంతువులన్నీ! వేటగాళ్లు మీసాలు మెలేస్తూ మేమే గొప్ప అని జబ్బలు చరుచుకోసాగారు.
ఇంతలో పెద్దగా గాలిదుమారం చెలరేగింది. ఆగాలి తీవ్రతకిచెట్ల కొమ్మలు ఎగిరిపడ్డాయి.వేటగాళ్లు దుమ్ము కంట్లో పడటంతో కుయ్యోమొర్రో అని అరవసాగారు.వారిలబోదిబో విన్న ఓ అశరీరవాణి "దిగిందా అహం! చేతిలో తుపాకీలున్నాయని పశుపక్ష్యాదులను భయపెట్టి అన్యాయంగా చంపుతారా? మాపంచభూతాలముందు  మీరంతా బలాదూర్ " అనటంతో అంతా సిగ్గు పడ్డారు. నీరు గాలి భూమి ని కలుషితం చేయరాదు🌹
కామెంట్‌లు