క్షుద్భాద: సి.హెచ్.ప్రతాప్
 మగధ రాజ్యాన్ని పరిపాలించే జయంతుడు అపర దానకర్ణుడిగా పేరుపొందాడు. ఆయన పాలనలో రాజ్యం ఎంతో సుభిక్షంగా వుండేది. మరణం అనంతరం జయంతుడు తన పుణ్య కర్మలకు ఫలితంగా స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ జయంతునికి   స్వాగత సత్కారాలతో పాటు అన్ని సౌకర్యాలు లభించాయి. స్వర్గంలో  ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది పైగా సకల భోగ భాగ్యాలు అందుబాట్లో ఉన్నాయి. కాని ఏం ఏంలాభం ?..! జయంతునికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. అక్కడ ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది వుండదం లేదు. ఎప్పుడూ ఏదో కోల్పాయినత్లు, వెలితిగా, అసంతృప్తిగా అనిపించసాగింది. ఎందుకు ఈ విధంగా ఉన్నాదా అని సంశయ నివృత్తి కోసం దేవేంద్రుడిని అడిగాడు జయంతుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో నీవు అనేక దానాలు చేసావని అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి ఎప్పుడైనా,ఎవరికైనా  అన్నదానం చేసావా?'' అనడిగాడు. దానికి కాస్త సేపు ఆలోచించిన తర్వాత నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు జయంతుడు.
"పోనీ ఎవరికైనా అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?'' అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన జయంతుడు చెప్పాడు
''అవును, నేను మారు వేషంలో దేశాటనలో వుండగా ఒక రోజు, ఒక పేద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను" అని జయంతుడు చెప్పాడు. అన్నదానం చేసే ఇంటిని చూపించిన నీ వేలిను నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు జయంతుడు. ఒక్క గుటక వేయదంతోనే ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టిన జయంతుడికి అన్నదాన ప్రాశస్థ్యం గురించి దేవేంద్రుడు చక్కగా వివరించాడు.
మనిషి పుట్టేప్పుడు ఏమి తీసుకురాడు, ఈ మధ్యకాలంలో ఏం సంపాదించినా, ఎంత కూడబెట్టినా పోయేటప్పుడు ఎవరూ ఏమి తీసుకువెళ్ళరు. కేవలం మంచి చెడు కర్మ ఫలితాలు తప్ప. భగవంతుడిచ్చిన సంపదలో మనిషి బ్రతికి ఉన్నన్ని రోజులు " అహంబ్రహ్మాస్మి"భావనతో తనలో దైవత్వాన్ని అలవరచుకుని తనకు కలిగినంతలో సాటి జీవులకు, ప్రాణులకు దానధర్మాలు చేయాలి. "క్షుద్బాద" ఆకలి అనేది మనకు ఎలా ఉంటుందో ఎదుటివారి ఆకలి కూడా అలాంటిదే అని గ్రహించే స్థాయికి 'స్థితి' కి రావాలి.  
సి హెచ్ ప్రతాప్ 
బాచిలర్స్ ఇన్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్స్( ఉస్మానియా)
ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
 
MOBILE no : 95508 51075

కామెంట్‌లు