* కోరాడ మినీలు *
 @  వీటికోసమేనా... !
             ****
జన్మ ఎందుకొచ్చింది...?అంటే 
కర్మననుభవించటానికేనట.. !
పుట్టి - చచ్చి.... చచ్చి - పుట్టి, 
  ఈ ప్రయాణాని కoతం లేదా ?
గమ్యం చేరేదెప్పుడు !?
   శాంతిని పొందే దెప్పుడు ?!
అలసట,ఆయాసం,అశాంతి... 
బ్రతకటానికి తినటం.... 
   తినటానికి బ్రతకటం.... 
 వీటికోసమేనా ఈ  ఎడతెరిపి లేని ప్రయాణం.... !
       *******

 ఎందుకు... !?
          ****
ఎన్నో జన్మల పుణ్యఫలం గా 
     లభించిన ఈ జన్మను... 
హాయిగా...ఆస్వాదిస్తూ..అనుభూతిస్తూ...సుఖ, సౌఖ్యాలను భవిస్తూ...ఆనంద స్వర్గం లా  గడపక,దుఃఖ పెడుతూ - దుఃఖ  పడుతూ... నరకం గా.... 
    మార్చు కుంటా వెందుకు..!?
. . .   *****

కామెంట్‌లు