నేర్చుకుందాం!అచ్యుతుని రాజ్యశ్రీ

 కొంత మంది పిల్లలు ఊరికే అనవసరంగా సరదాగా చీమల్ని వానపాములను చంపుతారు.అవి మనజోలికి రాకున్నా చంపడం మన శాడిస్ట్ బుద్దిని తెలుపుతుంది. అలాగే పూలపైవాలే సీతాకోకచిలుక తుమ్మెద ను పట్టుకునే ప్రయత్నంచేస్తారు.టీచర్ పిల్లలకు ఇలావివరించసాగింది"ఈరోజు మనం సరదాగా పిక్నిక్ కి వచ్చాము.ఆగండుచీమలు ఎంత ఐకమత్యంగా ఒకే లైన్ లో సైనికుల్లాగా క్రమశిక్షణ తో నడుస్తున్నాయో!?వానపాములు రైతు కి మిత్రులు. భూమిని సారవంతంచేస్తాయి.మనం కూడా ఇంట్లో పెంచవచ్చు. "ఇంతలో ఆయా అందరికీ షర్బత్ ఇచ్చింది. "టీచర్!షర్బత్ లో పెద్ద గండుచీమ."అరిచాడు శివా. టీచర్ ఆగ్లాసులోని చీమని తనచేత్తో తీసేసి దూరంగా విదిల్చింది. "శివా!అది నావేలునికొరకలేదు.దాని ప్రాణం ని కాపాడిన తృప్తి నీకు నాకు ఉంది. అవునా?"అనటంతోపిల్లలంతా ఔనని తలూపుతూ అక్కడి పశుపక్షులను చూస్తూ కేరింతలు కొడుతున్నారు 🌹
కామెంట్‌లు
Popular posts