పల్లవి :-
ప్రియుని వలపు తలపులలో
మైమరచే మగువా.... !
దూరమైన మీ రిరువురు....
దరి చేరుదురనుఆనందమా !!
"ప్రియుని వలపు... "
చరణం :-
చెప్పుకున్న ఊసులు...
చేసుకున్న బాసలు....
గుర్తుకు వస్తున్నవా... !
ప్రియుని చిలిపి పనులు తలచి,ఆ ముసి-ముసినవ్వులా
" ప్రియుని వలపు... "
చరణం :-
ఇన్నాళ్ల ఎడబాటు నేటితో తీరేనా...మీ రిరువురుఒక్కటై...
ప్రణయకేళితేలగా...ప్రేమజగతి
పులకించి, పరవశించిపోవగా !!
"ప్రియుని వలపు.... "
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి