బ్రహ్మ మానస పుత్రులలో ఈయన ఒకరు. సప్త ఋషులలో సుప్రసిద్ధుడు. అహల్య దేవి అతిలోక సౌందర్యవతి. ఆమె గౌతముని భార్య. విశేషం ఏమిటి అంటే అహల్యను చిన్ననాటి నుండి గౌతముడే పెంచాడు. అది బ్రహ్మ ఆజ్ఞ. గౌతముడు ఒకసారి తపస్సు చేసి"తాను విత్తనం చల్లితే ఒక జాములోపు పంట పండాలి'అనే వరం పొందాడు. ఒకసారి కొందరు బ్రాహ్మణుల మాయ వలన గౌతమునికి గోహత్యా దోషం వచ్చింది. గోహత్యా దోషం పోగొట్టుకోవడం కోసం గోదావరి నదిలో ఒక శాఖ గౌతమిని భూమి మీదకు తీసుకు వచ్చాడు గౌతముడు. వీరికి శతానందుడు అనే పుత్రుడు కలిగాడు. శతానందుని కుమారుడు శరత్ బంధుడు వీరి వంశంలోనే కృపాచార్యుడు, కృపి పుట్టారు. ఆంజనేయుని తల్లి", అంజనా దేవి"వీరి సంతానమే. గౌతముని వేషంలో ఒకసారి ఇంద్రుడు అహల్యను మోసం చేయ ట్నింపగా అహల్యను రాయివి కమ్మని శపించాడు. రామావతారంలో రాముని పాదస్పర్శతో ఆమెకు శాప విముక్తిని ప్రసాదించారు. రామాయణంలో ఇది విశేష ఘట్టం. గౌతముడు వ్రాసిన ధర్మ సూత్రాలు అందరూ ఆచరింపదగినవి.
గౌతమ మహర్షి: ;-తాటి కోల పద్మావతి గుంటూరు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి