ఆఊరిచివర పేద దంపతులు ఉన్నారు. ఏపూటకాపూట సంపాదించినదానితో పొట్ట నింపుకునేవారు.తాము అన్నంతినబోయేముందు గుప్పెడు మెతుకులు బైట కాకులకు వేసేవారు. తమ పితృదేవతలు సంతోషంగా ఉంటారని వారి నమ్మకం!రాత్రి అంతా భగవస్మరణలో గడుపుతారు.ఓరోజు ఆఊరి జమీందారు మారువేషంలో సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలని బైలు దేరాడు.తన దివాన్లు ఇతరులు జనాలని ఎలా చూస్తున్నారో తెలుసు కోవాలనుకున్నాడు.ఆపేద దంపతుల గుడిసె ముందు ఆగి"తాతా!నేను బాటసారిని.ఈరాత్రికి మీఇంట్లో పడుకుంటా"అన్నాడు.భార్యను కేకేసి అన్నంవడ్డించమన్నాడు.రెండు విస్తర్లువేసిందామె.ఒక విస్తరిలో అన్నం వడ్డించింది."తాతా!నాతోపాటు నీవూ తినాలి" జమీందారు పట్టుబట్టడంతో సరేనని పక్కనే ఉన్న చిన్న చిమ్నీ దీపంని ఆర్పేశాడు.నోరు చప్పుడు చేస్తూ మంచినీరు గటగటా తాగుతున్న తాత తినేపద్ధతి జమీందారు కి నచ్చలేదు. "దీపం ఎందుకు ఆర్పావు?" జమీందారు విసుగ్గా అడిగాడు. "నాయనా!పాండవులు దీపంలేకుండా తిని గురి తప్పకుండా బాణాలు వదిలేవారు.ఈవిషయంలో అర్జునుడు గొప్ప!"
భోజనం ముగిసిన తర్వాత జమీందారు బైట చెట్టు కింద పడుకున్నాడు"దీపం ఆర్పా రెందుకు?" భార్య ప్రశ్నకు రైతు జవాబు ఇది"పిచ్చి దానా!మనిద్దరి అన్నం ఆకలిమీద ఉన్న అతనికి సరిపోతుంది. అందుకే ఆచీకటిలో నాఅన్నం కూడా అతనికి పెట్టాను.చప్పుడు చేస్తూ తింటున్నట్లు నటించాను. " ఆదంపతుల దొడ్డ బుద్దికి ఆశ్చర్యపోయాడు. తెల్లారుతూనే తన భవంతికి వారిని తీసుకుని వెళ్లి పనిలో నియమించి జీవితాంతం వారిని పోషించాడు.🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి