న్యాయాలు -58
గృహ మార్జాల న్యాయము
*****
గృహం అంటే ఇల్లు. మార్జాలం అంటే పిల్లి.పిల్లి ఇంటిని కనిపెట్టుకుని ఉంటుంది. కానీ దానికంతగా గౌరవం ఇవ్వం.ఏనుగు బయట ఉన్నప్పటికీ దానికి ఎంతో గౌరవం ఇస్తాం.
కారణం ఎందుకో వేమన పద్యంలో చూద్దాం.
ఉన్న ఘనతను బట్టి మన్నింతురే కాని/ పిన్న పెద్ద తనము నెన్నబోరు/వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా/ విశ్వధాభిరామ వినురవేమ.
ఇందులో వ్యక్తి చేసే పనులను, అతనిలోని ప్రతిభను బట్టి సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవం లభిస్తాయి. అంతే గానీ అతడు వయసులో చిన్న లేదా పెద్ద అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోరు.
వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు. వసుదేవుని కుమారుడు. అయితే వసుదేవుడు, వాసుదేవుడు తండ్రీ కొడుకులు.వయసులో పెద్ద వాడు కదాని వసుదేవుని గౌరవిస్తారా,కీర్తిస్తారా... అలా చేయరు కదా! ఎంతో ప్రతిభ ఉండి ఎన్నో ఘనకార్యాలు చేశాడు కాబట్టి చిన్నవాడైప్పటికీ శ్రీకృష్ణుడినే కొలుస్తారు.
ఇక్కడ గ్రహించ వలసింది ఏమిటంటే పిల్లి, ఏనుగు రెండూ జంతువులే. అపిల్లి మన ఇళ్ళలో తిరిగేదే. వాటిని చిన్నా పెద్దా అనే తేడా పక్కన పెడితే ఏనుగు ప్రత్యేకమైన లక్షణాలతో గౌరవింపబడుతుందనేది మనకు తెలిసిందే.
అలాగే మనుషులు కూడా ...చిన్నా ,పెద్దా,వర్గ వర్ణ భేదం లేకుండా తమ తమ ప్రతిభ,సామర్థ్యాలతో కూడిన వ్యక్తిత్వాలతో మాత్రమే గౌరవం పొందుతారనేది ఈ గృహ మార్జాల న్యాయము ద్వారా తెలుసుకోవచ్చు.
ఇదే విషయాన్ని ఉదహరిస్తూ రాసిన మారద వెంకయ్య గారి భాస్కర శతక పద్యం చూద్దాం.
పండితులైన వారు దిగువందగ నుండగ నల్పుడొక్కడు/ద్దండత బీఠమెక్కిన బుధ ప్రకరంబుల కేమి యెగ్గగున్/ కొండొక కోతి చెట్టు కొనకొమ్మనుండగ క్రింద గండభే/రుండమదేభ సింహ నికురంబులుండవె చేరి భాస్కరా!
ఈ పద్యం యొక్క భావం:- పండితులైన వారందరూ కింద కూర్చుని ఉండగా ఒక అల్పుడు అంటే విద్యా, జ్ఞాన హీనుడు అగ్రాసనం/ ఉన్నత స్థానం మీద కూర్చున్నంత మాత్రాన పండితుల విలువేం తగ్గదు. ఎందుకంటే మదపు టేనుగులు, సింహాలు,గండభేరుండం లాంటి పక్షులు చెట్టు కింద ఉండగా చెట్టు కొన కొమ్మల మీద కోతి తిరుగుతూ ఉంటుంది కదా!
ఇంట్లో వారైనా అంటే బంధువర్గం వారైనా, తెలియని వారైనా వారి వారి పనులు, ప్రవర్తన, ప్రతిభా సామర్థ్యాలచే మాత్రమే లోకంలో కీర్తి ప్రతిష్టలు గౌరవం పొందుతారనేది గ్రహించాలి.
ఇలాంటి వాటికి ఈ గృహ మార్జాల న్యాయము న్యాయం సరిగ్గా సరిపోతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి