ఏ జ్ఞాపకాలు తరుముతుంటేగమనం ఆగిపోయిందో!ఏ గాయం మదిని సలిపితేకనుకొలకుల చెలమ ఊరిందో!ఏ మలుపున ఏ గెలుపు కోసంమనసు వాకిట వేచి ఉందో?ఏ గుండె అడుగున పొర కదిలిందోఎంత తడి పేరిందో!ఏ ఊహలు మదిలో మెదిలాయోఎద ఎంతగ కదిలిపోయిందో!ఏ కారణానికి ఏ కలతలోఏ కాలంతో ఎంత రణమో!ఋణమో!ఏ దారి ఎటు పోతుందోఎవరు ఎవరికి ఎంత వరకూ తోడోఅయోమయాలు తొలగించిప్రేమ మయం చేసే ఉదయానికి🌸🌸 సుప్రభాతం 🌸🌸
సుప్రభాత కవిత ; - బృంద
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి