సుప్రభాత కవిత ; - బృంద
ప్రేమ పంచడానికే గానీ
ఉంచుకోడానికి కాదు....

సృష్టి లో ప్రతి అణువూ
ప్రేమే కనిపిస్తుంది...

నింగికి నేలంటే ప్రేమ
నీళ్ళు నిల్వ చేసి
జీవికనిస్తుంది...

నేలకు నింగంటే ప్రేమ
కెరటంలా చేరాలని
ఆరాటపడ్డా......
ఆవిరిలామారి ఆకాశం
చేరుకుంటుంది.

ఏటికీ సెలయేటికీ
కడలంటే ప్రేమ

గిరులకు శిఖరాలకు
మబ్బులంటే ప్రేమ

మబ్బులకు గాలంటే
వల్లమాలిన ప్రేమ
తగలగానే కరిగి నీరై
వర్షిస్తుంది

గాలి అందరికీ కావాలి
గాలి అంతటా వుంటుంది
ఊపిరిపోస్తూ...
ఊసులు చెప్తూ...

ఎండ ...వేడిమి లేకపోతే
పచ్చదనమే లేదు
పరిశుభ్రతే లేదు
అందరికీ ఆహారం ఇచ్చే
జీవాధారం...

ఇవన్నీ ప్రేమను ఇవ్వడంలోనే
నిలిచిఉన్నాయి...

మరి మనిషెందుకు
స్వార్థపరుడయాడు?

నవ్వితే నష్టమా?
పలకరిస్తే పాపమా?
సహకరిస్తే శాపమా?
దయ గలిగి ఉంటే దోషమా?
సాయం చేస్తే అపాయమా?
చేయూతనిస్తే మించిపోతాడని భయమా?

బ్రతకనిస్తే బ్రతుకునిస్తే
బ్రతుకు కు  అర్థం వుంటుంది 
పరమార్థం తెలుస్తుంది

ఎవరు ఎంతవరకూ
శాశ్వతం?

చిన్ని జీవితంలో  ప్రేమను
పంచి  ప్రేమను పొందే
వరం మనిషికే వుంది.

మనసులో మమతల
పరిమళాలు నింపే
ప్రభాత  కిరణాలకు

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు