ఆమెను అంతా అమ్మమ్మ గారూ అని పిల్చేవారు.సనాతన చాదస్త కుటుంబంలో పుట్టారు.తండ్రి పోలీస్ సూపరింటెండెంట్ వీరేశలింగం పంతులు గారికి కుడిభుజం.నలుగురు అన్నదమ్ములకి ఏకైక సోదరి. భర్త రామారావు గారి ప్రోత్సాహంతో వీణనేర్చుకున్నారు.ఒకకొడుకు కూతురు. కాకినాడలో కావ్యపఠనం కుట్లు అల్లికలు తోటిమహిళలకు నేర్పేవారు.దేశసేవికాసంఘం ద్వారా ఖాదీ అమ్మేవారు.ఇంటికి వచ్చే అతిథులకు వండివార్చటం ముందు భర్త అతిధికి పెట్టాకనే తాను తినేవారు. కొడుకు పెళ్ళి నిశ్చయం ఐన తర్వాత భర్త మరణం తో కృంగిపోయారు.కానీ తిమ్మాబాయినే తన కోడలుగా చేసుకున్నారు. మద్రాసుకి వెళ్లి పోయారు కుటుంబంతో.చెట్ పట్ లోని సేవాసదన్ లోహిందీ టీచర్ గా చేరారు.పిల్లలందరినీ చేర్చి ఆటపాటలు కథలుచెప్పి మామంచి అమ్మమ్మ గా మారారు. లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ గా పిల్లల క్లబ్ ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో సాని విద్యలు అని ఈసడించే నృత్యం సంగీతం ఆడపిల్లలకి నేర్పి ఆభావం శుద్ధ తప్పు అని చాటారు.
ఇక ఆమెలో ఓర్పు సహనంకూడా ఎక్కువ. ఓహరికథకుడు చెప్పే విధానం నచ్చక అంతాలేచి వెళ్లి పోయారు. మాలతీచందూర్"అబ్బ!ఎలాభరిస్తూ ఉన్నారండీ?" అంటే ఆమెఇచ్చిన జవాబు ఇది" ఆయన బాధపడతాడు గదా? అలా అవమానించరాదు."
ఆమెదగ్గరకి పాలగుమ్మి పద్మరాజు గారు బాలాంత్రపు నళినీకాంతరావుగారు తరచు వచ్చి కబుర్లు చెప్పేవారు. 1932లోకన్ననూర్ జైల్లో ఉన్నపుడు ఖైదీలకు చదువు చెప్పి హిందీ పరీక్షలకు సిద్ధంచేశారు. నళినీకాంతరావుగారు ఆమెను గూర్చి ఇలా చెప్పారు " సంక్రాంతి భక్ష్యాలు బాగా తినిపించేవారు."
ఫైలేరియా తో కాలుపోటుతో బాధ పడుతూ గూడా సంఘసేవచేశారు.పాలగుమ్మి వారి కథల్లో ఆమె కథావస్తువు.ఆమెతో పేకాడేవారు.టాగూర్ గోరా లోని ఆనందమయి పాత్ర వ్యక్తిత్వం అమ్మమ్మ గారిది అని అందరి అభిప్రాయం.
ఆమె ఆఖరిదశను కొడుకు ఇలా వర్ణించారు " అమ్మదివ్యంగా వెళ్లి పోయింది. చుట్టూ పూలచెట్లు పక్కనే ట్రాన్సిస్టర్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటం" అంత అద్భుత వాతావరణంలో ఆమె పరమాత్మను చేరింది.
అమ్మమ్మ ఎవరోకాదు దుర్గాబాయ్ దేశ్ముఖ్ నారాయణ రావు గార్ల తల్లి! ఆంధ్ర మహిళా సభకి వెన్నెముక! కూతురు కొడుకు చదువు కోసం బెనారస్ వెళ్తే ఆమె పడిన ఆర్ధిక బాధలు క్షోభ ఆపరమాత్మునికే ఎరుక! ఆకు చాటుపిందెలాగా బతుకుతూ తోటి మహిళల కష్టాలు తెలుసుకుని వారిని ఓదార్చి ఆంధ్ర మహిళా సభద్వారా ఆమె చేసిన సాయం పూలదండలో దారంలాగా కనపడనిది.తన పిల్లల భవిష్యత్తుకై పాటుపడిన ఆమాతృమూర్తి అందరికీ ఆదర్శం🌺

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి