వెంకటాపురం గ్రామంలో రామయ్య బట్టల నేత వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దూర దేశాల నుండి ముడి సరుకును తీసుకువచ్చి మగ్గం పై నేసి తన ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్న దుకాణంలో అమ్ముకుంటుండేవాడు. లాభం తక్కువ వేసుకొని సరసమైన ధరలకు మంచి నాణ్యత గల బట్టలు అమ్ముతుండడం వలన రామయ్య వస్త్రాలకు మంచి గిరాకీ వుంది. పొరుగూరు నుండి కూడా ప్రజలు వచ్చి రామయ్య దుకాణంలో వస్త్రాలు కొనుక్కెళుతుండేవారు.
ఒకసారి ఆ రాజ్యంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలకు ఉపాధి కూడా కరువయ్యింది. దానితో వస్త్రాలకు బేరం తగ్గింది. రామయ్య వద్ద నేసిన వస్త్రాలను కొనేవారే కరువయ్యారు. వ్యాపారం కుంటుపడడం తో రామయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఒకవైపు వ్యాపారం అటకెక్కింది, మరొకవైపు కుటుంబాన్ని పోషించే కునేందుకు అతగాడికి బట్టలు నేయడం తప్ప మరొక విద్య రాదు. దానితో కుటుంబం నడిపేందుకు వున్న ఆస్తులు అమ్ముకోవడంతో పాటు అప్పులు కూడా చేయసాగాడు.
తమను ఈ గండం నుండి ఎలాగైనా గట్టెక్కించమని రోజూ కన్నీళ్ళతో దేవుడిని ప్రార్ధించ సాగాడు.
ఒకరోజు గుడిలో కూర్చోని ప్రార్ధిస్తుండగా ఆలయ పూజారి వచ్చి రామయ్యను సంగతేమిటని అడిగాడు. మమ్మల్ని కష్టాల నుండి బయట పడేయమని దేవుడిని ప్రతి రోజు ప్రార్ధిస్తున్నాను. కాని నా మొరను ఆయన ఆలకించడం లేదు. ఎప్పటికి నా కష్టాలకు విముక్తి ? అని చెప్పి బాధపడ్డాడు రామయ్య.
రామయ్య బాధపడకు. ఆ దేవుడు నీ ప్రార్థనను ప్రతి రోజు ఆలకిస్తున్నాడు అయితే సమయం రాగానే తప్పక నీ కష్టాలు తీరుస్తాడు, అంతవరకు ఓరిమితో, ధైర్యంగా ఉండు. ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసును. సమయం వచ్చినప్పుడు ఫలితం దానంతట అదే నిన్ను వెదుక్కుంటూ వస్తుంది " అని హిత వచనాలు చెప్పాడు పూజారి.
కొన్ని రోజుల తర్వాత పొరుగూరు జమీందారు కూతురికి పెళ్ళి కుదిరింది. పెళ్లి వస్త్రాలు ఎక్కడ కొనాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఆ ఊరివారు రామయ్య పేరు చెప్పారు. వెంటనే రమ్మని రామయ్యకు కబురెళ్ళింది. రామయ్య వద్ద వున్న కొన్ని మంచి వస్త్రాలతో పాటు కొత్త వస్త్రాలను నేయమని కొంత డబ్బు ముందస్తుగా ఇచ్చాడు జమీందారు.
అనుకున్నవేళకు వస్త్రాలను నేసి జమీందారుకు అందించాడు రామయ్య. మిగితా ధనంతో పాటు కొంత ధనం కూడా బహుమానంగా ఇచ్చాడు జమీందారు. నాటితో రామయ్య అప్పులన్నీ తీరిపోయాయి. దుర్భిక్ష పరిస్థితులు కూడా తొలగడంతో రామయ్య వ్యాపారం తిరిగి పుంజుకోసాగింది.
రామయ్య జీవితంలో తిరిగి కొత్త కళాకాంతులు ప్రవేశించాయి. ఫలితం ఎప్పుడు ఇవ్వాలో భగవంతునికి తెలుసు.ఫలితం పై దృష్టి పెట్టకుండా , చిత్తశుద్ధితో మన పని మనం చేసుకుపోవడం మన కర్తవ్యం. చేసుకున్న కర్మల బట్టి తప్పక ఫలితం వస్తుంది అన్న నగ్న సత్యాన్ని రామయ్య అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి