బడికి పోతున్నావా బుజ్జాయీ!
ఆ బడి వార్తలేమి బుజ్జాయీ?
ఊరుమధ్యన ఉన్నది ఓబడి
ఆ బడియే నాకు ఒక గుడి
గుడి అన్నావు కాని బుజ్జాయీ!
ఆ గుడిలో ఉన్నదెవరు బుజ్జాయీ?
ఆ గుడి సరస్వతీదేవి కొలువు
ఆ అమ్మ నాకు ఇచ్చు చదువు
చదువు చెప్పేదెవరు బుజ్జాయీ!
ఆ చదువు లాభమేమి బుజ్జాయీ?
అయ్యవారు చెబుతారు పాఠాలు
ఆ పాఠాలు ఇస్తాయి నాకు జీతాలు
జీతాలెందుకు నీకు బుజ్జాయీ!
ఆ పైసాలు ఏమిచేస్తావు బుజ్జాయీ?
పైసాలుంటే చేసుకుంటా నేనుకళ్యాణం
సుఖముగా జరుపుకుంటా నాకుటుంబం
కుటుంబమెందుకు నీకు బుజ్జాయీ!
అక్కడ ఎవరెవురుంటారు బుజ్జాయీ?
అక్కడ ఉంటారు నాతో అమ్మానాన్నలు
వారితోపాతుంటారు కొడుకులుకుమార్తెలు
పిల్లలెందుకు నీకు బుజ్జాయీ!
ఆ పిల్లల పెంచేదెవరు బుజ్జాయీ?
పెద్దయి పిల్లలను కంటాము
బాగా వారిని పోషించుకుంటాము
పెరిగి పెద్దదువుగాని బుజ్జాయీ!
అపుడు ఏమిచేస్తావు నీవు బుజ్జాయీ?
పూర్తిగా ఉపయోగిస్తాను నా శక్తి
ఆపై చాటుతాను నా దేశభక్తి
ఏదేశము నీది బుజ్జాయీ!
ఆ దేశ గొప్పతనమేమి బుజ్జాయీ?
భారతదేశము మనాది అతిపురాతనదేశము మనది
మనదేశం ఘనమైనది మనసంస్కృతి విలువైనది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి