న్యాయాలు -56
గర్ధభ చందన న్యాయము
*****
గర్ధభము అంటే గాడిద. చందనము అంటే గంధము. సువాసలు వెదజల్లే పదార్థం .
గాడిద పై ఎంత మంచి సువాసనలు వెదజల్లే గంధపు చెక్కల మూట వేసినా దానిని మోస్తుందే తప్ప దాని యొక్క పరిమళాన్ని గ్రహించదు.
అంటే విద్య ఎంత ఉన్ననూ , చదువెంత వచ్చినా అందులోని సారాన్ని, జ్ఞాన పరిమళాన్ని గ్రహించలేని వాడు ఆస్వాదించ లేని వాడు గర్థభం లాంటి వాడనే అర్థంలో ఈ గర్ధభ చందన న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ న్యాయం గురించి వేమన రాసిన పద్యం చూద్దాం.
"హీనుడెన్ని విద్యలు నేర్చిన గాని/ ఘనుడు గాడు హీన జనుడె కాని/పరిమళములు మోయ ఖరము తా గజమౌనె/ విశ్వధాభిరామ వినురవేమ!"
ఇందులో అంతరార్థం ఏమిటో గమనిద్దాం. "నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా, అతడు గొప్ప వాడు కాలేడు. సుగంధ ద్రవ్యాలు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు."
అంటే ఇక్కడ గొప్పవాడిని ఏనుగుతోనూ అంటే విద్యలోని సారాన్ని గ్రహించిన వ్యక్తిగానూ, నీచుడైన వాడిని గాడిదతోనూ అంటే ఎంత చదువు చదివినా అందులోని సారాన్ని ఏమాత్రం గ్రహించని వాడిగానూ పోల్చడం జరిగింది.
ఇదే విషయాన్ని ఉదహరించే మరో శతక పద్యాన్ని చూద్దాం.
"చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్/ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/ పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!"
నల చక్రవర్తి చేసినట్టుగా కూరను ఎంత మంచిగా వండినా అందులో ఉప్పు వేయక పోతే ఆ కూర రుచిగా ఉండదు. అలాగే మనిషి ఎంత చదువుకున్నా అందులోని సారాన్ని గ్రహించక పోతే ఆ చదువుకు ప్రయోజనము ఉండదు. అలాంటి వ్యక్తిని గుణవంతులు ఎవ్వరూ మెచ్చుకోరు .
అలాంటి వ్యక్తిని సుగంధ ద్రవ్యాలను లేదా గంధపు చెక్కల మూటను మోసే గాడిదతో పోల్చుతూ ఈ "గర్ధభ చందన న్యాయమును" ఉదాహరణగా చెప్పడం జరిగింది .
కాబట్టి జ్ఞాన సారాన్ని కూడా పొందాలనేది గ్రహించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి