* కోరాడ నానీలు *

 సాకార సద్గుణ..... 
   నిరాకార, నిర్గుణాల ... 
      పూజలనందేడు.. !
       సర్వేశ్వరుడు.. !!
    *******
హిమగిరియైనా..... 
  స్మశానమైనా.... 
  ఆ రుద్రుడున్న చోటే... 
  శివమయ కైలాసం.... !
.... ********
సాహిత్య - సంగీత.... 
. నాట్యాభినయ...... 
    లయకారుడీతడు .... 
......సాక్షాత్సర్వేశ్వరుడు !
     ********
 అమృతమిచ్చి.... 
   విషము స్వీకరించె... !
     సతికి సగ  మిచ్చె ... 
      అర్ధ నారీశుడై  .. !!
     ********
నిరంతర యోగం... 
  నిర్వికార  భోగం.... 
   సత్యమే... శివం... !
    శివమే... సుందరం.. !!
  . ******
కామెంట్‌లు