మనలో చాలా మందికి ఇన్ఫీరియార్టీ సుపీరియార్టీకాంప్లెక్సు సర్వసాధారణంగా ఉంటాయి. రెండు మన అభివృద్ధి కి ఆటంకాలు!నేను అన్నివిధాల తక్కువ ఎందుకూపనికిరాను అనే భావం తో ముందుకు సాగలేము.మన భౌతిక శరీరం ఎలాఉంది అనేది ముఖ్యంగా దు.మనబుద్ధికుశలత మాటచాతుర్యం మర్యాద మన్నన తెలివితేటలు సమయస్ఫూర్తి వల్ల మనకు గౌరవమర్యాదలు లభిస్తాయి.
ఆక్లాస్ లో శివా చాలా పొట్టి.హరిచాలా పొడుగు. లంబు జంబు అని ఇద్దరినీ పిల్చేవారు.శివా అన్ని సబ్జెక్టులలో ఫస్ట్. హరి 60%మార్కులుతో పాస్!ఆరోజు టీచర్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తూ అంది"మీరు శివాని అరేపొట్టోడా!మరుగుజ్జు అని తెగ ఏడ్పిస్తారు.కానీ వాడు అదేమీ పట్టించుకోకుండా చదువు పై దృష్టి పెట్టి అన్నిసెక్షన్స్ మీద బెస్ట్ బాయ్ అనిపించుకుంటున్నాడు.లంబూ అని హరిని హేళన చేస్తారు. అతను అన్ని ఆటల్లో ఛాంపియన్. స్కూల్ కి ఎన్నో ట్రాఫీలు బహుమతులు తెచ్చాడు.
మనరెండవ ప్రధాని లాల్బహద్దూర్ శాస్త్రిజీ నెహ్రూ తర్వాత గట్టి ప్రధాని నీతినిజాయితీ నిస్వార్థ పరుడన్న పేరు సంపాదించారు.ఆయన జైజవాన్ జైకిసాన్ నినాదం నేటికీ స్మరిస్తున్నాం.తన పిల్లలను మామూలు అందరం ఎక్కే బస్సు లో బడికి పంపారు. ఆయన పిల్లలు ఎవరూ రాజకీయాలలోకి రాలేదు.ఇకజంబూ హరి అర్జున్ అవార్డ్ గెలుస్తాడేమో! ఒలింపిక్సు లో పతకాలు సాధిస్తాడేమో ?" అంతే!పిల్లలు కిక్కురు మనలేదు.వినయవిధేయతలతో మెలగటం ముఖ్యం🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి