శబ్ద సంస్కృతి! - అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆభీర్ అహీర్ గోప గొల్ల గ్వాలా అనే అర్ధాలు ఉన్నాయి.పతంజలి మహాభాష్యంలో ఆభీర్ తొలి సారిగా పేర్కొనబడింది.వారిజన్మస్థలం సింధు.వీరు కాఠియవాడ్ లో స్థిరపడ్డారు.పరాక్రమం బాహుబలంతోస్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేశారు.ఈశ్వర్ దత్త అనేఆభీర్ రాజు మహాక్షత్రప్ పదవి పొందాడు.క్రీ.శ.3వశతాబ్దిలో ప్రాచీన జనపదంగా పేరు గాంచింది.గోపకులుండేవారు.క్షాత్రధర్మం పాటించేవారు.ప్రాచీన భారతీయ సమాజంలో యవన పహ్లవ శక కుషాణ ఆభీర్ గుర్జరజాతుల్ని క్షత్రియులుగా పేర్కొన్నారు.పంచనద్ నివాసులు గా భారతంలో ఉంది.నేడు ఆభీర్ లు హర్యానా యు.పి. ఎం.పి.బీహార్ లో ఉన్నారు.కురుక్షేత్ర యుద్ధం ముగిశాక వీరు శూరసేన (బ్రజ్) ప్రాం తం చేరారు.బ్రజ్ అంటే గో చీర భూమి .వీరే కృష్ణుడి బాలలీలలుతో ఆనందించారు.
గ్వాల్ నించి గ్వాలియర్ వచ్చింది.ఆహీర్లు తమసంబంధాన్ని యాదవుల తో జోడించారు.ఆభీరీభాషప్రాకృతంతో కలిసి అపభ్రంశ పుట్టిందని గద్య పద్య భాషనే అపభ్రంశ అంటారు అని కొందరి అభిప్రాయం
అభిజన్ అంటే వంశం కులం.కానీ ఉన్నతకులంలో పుట్టిన అనే అర్థంలో వాడుతున్నాం.మరాఠీలో సభ్యత కలిగిన వాడు అని అర్థం.
అభిసార్అంటే ప్రేమికులు రహస్యం గా కలిసే చోటు అని సాహిత్యంలో పేర్కొన్నారు.పొలం తోట శిథిలాలయం స్నేహితులు ఇల్లు అడవి‌స్మశానం నదీ తటాన ‌కలుసుకుంటారుట!
అసలు నిజానికి అభిసార్ అభి‌సరణ అంటే ఏదో ఒక వైపు సాగటం.ఎవరినన్నా కలవటానికి వెళ్లేదారి.కానీ సాహిత్యంలో దీని అర్ధం మారింది.అభిసారిక అంటే నాయకుని కలవటానికై రహస్యం గా సంకేతస్థలంలో నాయిక వెళ్లటం! శుక్లాభిసారిక కృష్ణాభిసారిక దివాభి‌సారిక అని మూడు రకాలవారున్నారు🌷

కామెంట్‌లు