బ్రహ్మ, నారద సంవాదంలో.....
సర్వదేవమయ రథ వర్ణన - శివుడు యుద్ధమునకు వెళ్ళుట - పశుపతి అని పేరు - గణేశుని పూజ - త్రిపుర దహనము - మయుడు, త్రిపురాసురుని కొడుకులు బయట పడుట......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయనమః ఓం"*
*నారదా! "పశుపతి" అయిన రుద్రుని చూసిన దేవతా సమూహం ఇక త్రిపురముల అంతం జరుగుతుంది అనుకున్నారు. దేవదేవుడు, త్రిపుర సంహారానికి బయలుదేరి నప్పుడు, సకల చరాచర సృష్టి వారి వెంట కదిలింది. భగవానుడు కోటి సూర్యకాంతితో వెలిగి పోతున్నారు. వేరు వేరు వాహనముల పైన వెళుతున్న వారి అందరి చేతులలో అనేక విధాలైన ఆయుధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఒక ప్రాణ హరుడు లాగా కనిపిస్తున్నారు. బ్రహ్మ నైన నేను, విష్ణువు, ఈశానుని ముందు, జయ జయ ధ్వానాలు చేస్తూ నడుస్తున్నాము. గణరాజులు అందరిలో, శ్రేష్ఠుడైన భృంగి గణేశ్వరులతో, దేవగణముల మధ్య దివ్యమైన విమానాన్ని ఎక్కి ఉన్నాడు. ఆ భృంగి వెంట వున్న అనేక మంది అతి బలవంతులు, వీరులు అయిన గణాధ్యక్షులు మహేశ్వరునికి అన్ని వైపులా నడుస్తున్నారు.*
*తరువాత, శంభుడు, త్రిపురముల ను దహించుటకు, సకల సామగ్రితో సిద్ధమైన "సర్వదేమయ" రథమును ఎక్కి సంతోషముగా బయలుదేరారు. ధనస్సు కు అల్లే త్రాడు బిగించి, మహిమాన్వితమైన బాణమును సంధించి రోషావేశ పూరితంగా బయలుదేరారు. కానీ, ఎంత ప్రయత్నించినా రథము ముందుకు కదలడం లేదు. అప్పుడు, విరూపాక్షుడు అయిన శంకరునికి అశరీరవాణి వినిపించింది. "స్వామీ! మీరు జగదీశ్వరులే! అనుమానము లేదు. కానీ మీరు ఇచ్చిన వర బలము చేత గణపతి అడ్డు పడుతున్నాడు. మీరు, ఉమతో కలసి గణేశుని పూజ చేయవలసినది. గణేశుని పూజ పూర్తి కానంత వరకూ, త్రిపుర సంహారము చేయడం కుదరదు. " అప్పుడు, అంబాసమేతుడైన పన్నగభూషణుడు, గణపతి పూజ చేయగా, సంతృప్తి చెందిన గణేశుడు రథము ముందు భాగములో ఉండి, రథమును త్రిపురముల వైపు పోనిచ్చాడు.*
*గణపతని పూజించిన ఫలితంగా, భగవంతుడు అయిన శంకరునకు ఆ తారకాసురుని కుమారుల మూడు పురములు యథారూపమున ఆకాశంలో కనిపించాయి. శివుడు స్వయంగా పరబ్రహ్మ. స్వతంత్రుడు, సద్గుణుడు, నిర్గుణుడు, పంచదేవమయుడు, ఉపాస్యుడు. ఆ స్వామికి ఉపాస్యులు ఎవ్వరూ లేరు. అయినా, లోకాచారము ప్రకారము తన లీల చూపిస్తూనే ఉంటారు, శంకరుడు. ఆ లీలలో భాగమే శంభుడు గణపతి ని పూజించడం.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి