ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (28);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322


 కన్యాశుల్కం విశాఖపట్నంలో ప్రదర్శిస్తున్న బృందం ఉందని తెలిసింది. వారికి కబురు చేసి నెల్లూరులో  ప్రదర్శన ఏర్పాటు చేసి  కొంతమంది ప్రముఖులను కూడా పిలిచి ఈ నాటకాన్ని చూపించారు హాలు మొత్తం నిండి హాలుబయట కూడా వందల మంది ప్రేక్షకులతో కిటకిటలాడింది.  ఆ నాటకాన్ని చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉన్నదని ప్రశంసించిన వాడే  ఆ ఘనత కోటిరెడ్డి నిరంజన్ రెడ్డి గార్లదే  ఆ తర్వాత జ్యోతిర్మయి గురించి విని అన్నమాచార్య కీర్తనలు పాడడంలో దిట్ట అని తెలుసుకొని  వారు నడుపుతున్న సింహపురి రైతు వార్షికోత్సవానికి ఆమెను పిలిపించి కచేరి చేయించారు  ఆమె అన్నమాచార్య కీర్తనలను గురించి పీహెచ్డీ చేసే ప్రయత్నంలో ఉంది  ఆ సభకు నేను కూడా హాజరై ఆమెను గురించి నాలుగు మాటలు మాట్లాడాను  ఈ కార్యక్రమాన్ని సంగీత ప్రియులనే కాకుండా  పెద్దలను కూడా  ఆహ్వానించారు. ఆ వచ్చిన వారిలో ఆంధ్ర రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించిన సీతాదేవి గారి భర్త నాగేంద్రనాథ్ గారు  ప్రత్యేక పారిశ్రామికవేత్త జై రామ్  నాయుడు గారు చెంగల్ రెడ్డి గారు ఓబుల్ రెడ్డి గారు  నెల్లూరు మాజీ శాసనసభ్యులు జే కే రెడ్డి గారు లాంటి అనేకమంది పెద్దలు  హాజరై ఆ కార్యక్రమాన్ని తిలకించారు.  ప్రేక్షకులందరూ  పెద్దలతో సహా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కోటిరెడ్డి గారిని అభినందించారు.  ప్రేక్షకులు కూడా అప్పుడప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉండమని సలహా కూడా ఇచ్చారు సంవత్సరాలు గడిచిన తర్వాత మా అమ్మాయి నన్ను తాతను  చేసింది  మగ పిల్లవాడు  ఎంతో అదృష్టం ఉండాలి  ఎంతో ముద్దొస్తున్నాడు చిన్నప్పుడే వాడిని విజయవాడ తీసుకొచ్చాం  వాడి ముచ్చట్లతో కాలం గడుపుతున్నాం. మా అమ్మాయి మాత్రం అప్పుడప్పుడు విజయవాడ వస్తూ ఉండేది. అమ్మ గుర్తొచ్చి పిల్లవాడి మీద బెంగతో వస్తుందని అర్థం అయింది  కానీ ఆమెకు పెంచడం  అప్పుడు ఏమాత్రం అర్థం కాలేదు. వాడు మాకు బాగా అలవాటు అయ్యాడు  తరువాత సంవత్సరం గడిచేసరికి ఆడపిల్లకు తల్లి అయ్యింది  ఆ పాపను మాత్రం మాకు ఇవ్వలేదు అయితే కళాశాల స్థాయికి వచ్చేసరికి  విజయవాడలో నాకు బాగా పరిచయం ఉన్న  ఎస్ టి పి రాధాకృష్ణమాచార్యులు గారు ప్రిన్సిపాల్ గా ఉన్న కాలేజీలో చదవటానికి తీసుకొచ్చాను. నేను లయోలా కాలేజీలో చదువుతున్నప్పుడు  రాధాకృష్ణమాచార్యులు గారు మొదటిసారిగా విశ్వవిద్యాలయం నుంచి  అక్కడకు ఆంగ్ల భాషా బోధ కుడిగా వచ్చారు.  నాకు చాలా బాగా సానిహిత్యం ఏర్పడింది  అప్పటినుంచి నాతో నాటకాలు కూడా వేయిస్తూ ఉండేవాడు  ఆయన తమ్ముడు కూడా  మాతో పాటు నాటకాలలో వేషాలు వేసేవాడు.


కామెంట్‌లు