సంగీత కార్యక్రమాలు తీసుకున్నట్లయితే నిష్ణాతులైన వారిని ఎన్నిక చేసి ప్రొడ్యూసర్ గా నియమిస్తారు. ఒక్కొక్క వాద్యానికి ఉదాహరణకు వయోలిన్ ఎక్కువ కావాల్సి వస్తుంది కనుక ముగ్గురిని ఎన్నిక చేశారు. వేణువు కోసం ఇద్దరినీ, వీణ ఒకరిని క్లారినైట్ ఇద్దరినీ, సితార ఒకరిని, మృదంగం ముగ్గురిని తబలా ఒకరిని డప్పు డోలక్లను కలిపి ఒకరిని తంబురా కోసం ముగ్గురిని ఎన్నిక చేసుకున్నారు. వీరందరిని నిలయ విద్వాంసులు అని పిలుస్తారు వీరి కార్యక్రమాలనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పేరు ప్రఖ్యాతులు పొంది ఈ ప్రాంతానికి వచ్చి వారి సంగీత సభ నిర్వహించే సందర్భంలో ముందే వారిని సంప్రదించి వారి సమయాన్ని తీసుకొని ఆకాశవాణిలో ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వారికి సహాయంగా నిలయ విద్వాంసులే ఉంటారు.
బాలల కార్యక్రమం చిన్నపిల్లలకు శనివారం ఆదివారం రెండు రోజులు రెండు రకాల వయోభేదం కలిగిన వారికి కార్యక్రమాలను ఏర్పాటు చేసి తానే నిర్వాహకులుగా ఏడిద కామేశ్వరరావు గారిని ఎన్నిక చేశారు వారు చదువుకున్న వారు బాలల మనస్తత్వాలను అధ్యయనం చేసిన వారు ఏ వయసులో ఉన్న పిల్లలు స్త్రీలు కానీ, పురుషుడు కానీ ఎలా ప్రవర్తిస్తారో తెలిసిన వ్యక్తి. వారు శనివారం నాడు, మరీ చిన్న పిల్లలకు ఐదు ఆరు తరగతుల చదివి ఎంతవరకు ఉన్న పిల్లల్ని పిలిచి వారితో కార్యక్రమాలు చేస్తారు. ఆదివారం కొంచెం పెద్దవారిని పిలిచి వారితో కార్యక్రమాన్ని చేస్తారు. 15 రోజులకు ఒకసారి బయట పల్లెలలో ఉన్న పిల్లలను విడిచి వారితో కార్యక్రమాలు చేస్తారు ఏడిద కామేశ్వరరావు గారు. ఆ పిల్లల వయసులోకి వెళ్లి వారి బుల్లి బుల్లి మాటలు లాగా వారిని అలరిస్తూ వారిలో ఉన్న మేధస్సును బయటికి తీసుకుంటారు. అలా వారి దగ్గర శిక్షణ పొందిన వారు అనేక పెద్ద పెద్ద పదవులను విదేశాలలో ఉన్నవారు కూడా ఉన్నారు. స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలు శ్యామ సుందరి గారు అని విజయవాడ కేంద్రంలోనే ఆంగ్ల అనౌన్సర్ గా పనిచేస్తూ ప్రమోషన్ పై స్త్రీ ల కార్యక్రమాల నిర్వాహకులుగా ఎన్నికయ్యారు వీరిలో ప్రత్యేకించి స్త్రీల సమస్యలకు సంబంధించిన విషయాలను ప్రసంగం చర్చ, గోష్ఠి ల ద్వారా ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు సంభాషణ రూపంలో కార్యక్రమాలు ఉంటాయి. దీనిని రూపకల్పన చేసిన వారు విజయవాడ ఆకాశవాణి కేంద్రాన్ని ఒక స్థితికి తీసుకువచ్చి మంచి పేరు తీసుకువచ్చిన సుభద్ర గారు. వారు వారి శ్రీవారు శ్రీనివాసన్ గారు ఆమె తెలుగు, తమిళం కలిసి ఎంతో సేవ చేశారు విజయవాడ కేంద్రానికి వనిత వాణి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమాన్ని రూపొందించింది ఆమె.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి