డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు సభా కార్యక్రమాలలో చర్చకు వచ్చిన ప్రతి విషయంలోనూ ఎంతో చురుకుగా చలాకీగా పాల్గొనే ఆయన నైజం చూసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ పదవితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ అందరి తలలో నాలుకల ఉంటూ రాష్ట్ర ప్రజల హృదయాలలో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోగలిగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ సమయంలోనే ఎందరో యువకులు సన్నిహితంగా ఉంటూ ఆయన వల్ల ఎంతో లబ్ధి పొందారు తరువాత రాజకీయాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పులు సంభవించాయి రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యులు ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పై అధిష్టానానికి ఫిర్యాదులు చేసి ఆయన స్థానంలో అంజయ్య గారిని ముఖ్యమంత్రిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. మరికొంత కాలానికి కాంగ్రెస్ లో గ్రూపు లు మామూలే అంజయ్య గారి మీద లేనిపోని ఫిర్యాదులు చెప్పి ఆయన స్థానంలో భవనం వెంకట్రామిరెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. మళ్లీ కాంగ్రెస్ సభ్యులకు భవనం గారి పోకడ నచ్చక కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు అయిన శ్రీమతి ఇందిరా గాంధీ వద్దకు కొంతమంది కాంగ్రెస్ శాసనసభ్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని అడిగారు కానీ అప్పుడు ఇందిరా గాంధీ గారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆయన క్యాబినెట్ లో కూడా రాజశేఖర్ రెడ్డి గారు మంత్రివర్గ సభ్యుడిగా ఉన్నారు 1983 రాష్ట్ర జనరల్ ఎన్నికలకు ముందు ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీలో కలహాలను మూటా తగాదాలను తెలుగువారి ఆత్మభిమానాన్ని ఢిల్లీ పెద్దల వద్ద కట్టి పెట్టిన వైనాన్ని ముఖ్యమంత్రి ఆత్మ గౌరవం పేరుతో ఆయన అఖండ విజయం సాధించారు.
ఆ ఎన్నికలలో హేమాహేమీలైన రాజకీయ దురంధరులను ఓడించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయం చెప్పుకోవాలి 1979 ఎన్నికలలో రాష్ట్రమంతటా ఇందిరా గాంధీ పార్టీ ప్రభంజనంలోనూ 1983 లో జరిగిన ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం ప్రభంజనంలోనూ ఎదురు నిలిచి గెలిచిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు అంటే వారు ఏ పదవిలో ఉన్నా మంత్రిగా ఉన్నా శాసనసభ్యులుగా ఉన్నా తన సొంత నియోజక వర్గాన్ని మర్చిపోలేదు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రజల గుండెలలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1978- 1983 మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రిగా మా ప్రాంతాలకు వచ్చినప్పుడు వారిని కలుసుకొని గన్నవరం నియోజవర్గం సమస్యలు ఆయనతో చర్చించాడు మా రత్న బోస్.
జననేత- వై.ఎస్.ఆర్ (6);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి