01.
సీ.
వేంచేయవె"యుగాది"వేగంబుగానీవు
ధరలన్నిదించవేధరణిపైన
దేశప్రజలకునుతీరికలేనట్టి
పనులప్పగించవేబాధ్యతగను
ఇంటింటయానందమింటింటయారోగ్య
సిరులనందించవేమరచిపోక
ఆకృత్యములనాపి,యాపదల్ తొలగించి
బంధాలునిల్పవేపదిలముగను
(తే.గీ.)
ధర్మమార్గానపయనించదక్షతనిడి
మంచియాలోచనలతోడమసలునట్లు
క్రొత్తవత్సరమందునకోరుకొనియు
శుభమువిభవములందించు"శోభకృత్తు"!!!
సీ.
వేంచేయవె"యుగాది"వేగంబుగానీవు
ధరలన్నిదించవేధరణిపైన
దేశప్రజలకునుతీరికలేనట్టి
పనులప్పగించవేబాధ్యతగను
ఇంటింటయానందమింటింటయారోగ్య
సిరులనందించవేమరచిపోక
ఆకృత్యములనాపి,యాపదల్ తొలగించి
బంధాలునిల్పవేపదిలముగను
(తే.గీ.)
ధర్మమార్గానపయనించదక్షతనిడి
మంచియాలోచనలతోడమసలునట్లు
క్రొత్తవత్సరమందునకోరుకొనియు
శుభమువిభవములందించు"శోభకృత్తు"!!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి