యుగానికి ఆరంభం;- డాక్టర్ పున్న విజయలక్ష్మి--చరవాణి: 9182741217
 శుభ కృత యుగాది కి స్వాగతం;- 
=========================
యుగానికి ఆరంభం ఉగాది
బ్రహ్మ సృష్టికి ఆరంభం ఉగాది
తొలి తెలుగు వత్సరానికి ఆరంభం
త్రికాల ఉషాకిరణాల మాతృ 
                     స్వరూపమే ఉగాది
రుతువులారంభంతోనే
               వసంతాన్ని తెచ్చే ఉగాది
సూర్యుడు మేషరాశిలో అడుగుపెట్టే
               తొలి ఆరంభమే ఉగాది
మావి చిగురు టాకు తొడిగే తొలి 
                       ఆరంభమే ఉగాది
మహారాష్ట్రలో గుడి ఫడ్వాయని
కేరళలో విష్ యు అని
సిక్కులు వైశాకి అని
తమిళనాడు పుత్తాండయ్యని
బెంగాలీలు పోయ్ లా బైసాక్ యోని
ఏ పేరుతో పిలిచిన ఉగాది తెలుగువారి
          తొలి వత్సరాది పండుగ……
ఆడపడుచులు పట్టు పరికిణీలతో 
నట్టింట నడయాడు వెల్లువే ఉగాది…..
బొబ్బట్లు నెయ్యి నైవేద్యాల మావిచిగుడ్ల మాటను కోయిలకు హుహు రాగాలై…..
షడ్రుచుల మేలవింపుతో నిండిన ఉగాది పచ్చడి తోనే నిండుతనం వచ్చేను…..
జీవితమంటేనే షడ్రుసుల సమాహారమని తెలిపేను ఉగాది…….

కామెంట్‌లు