శోభ కృత ఉగాది పలకరింపు;- డాక్టర్ .పున్న విజయలక్ష్మి సరూర్ నగర్ రంగారెడ్డి జిల్లా-చరవాణి.9182741217
 శోభకృత ఉగాది
ప్రపంచ కవిత దినోత్సవం 
ఉగాది పండుగ సందర్భంగా……!!
==========================
నేను ఏదో తపన పడుతున్నాను
అంతలో నా పాఠశాల ఆవరణలో
వేప చెట్టుపై రివ్వున రెక్కలు వాల్చుతూ….
నల్లని పక్షి నన్నాకర్షించింది !!

ఎంత అందమైన నీలం వర్ణ పక్షి ?!
ఎంత వింత పక్షి అనుకునే లోపే ఎగిరి పాయె !!
అంత లోనే నా విద్యా ర్థి కుసుమాలు
కుహూ కుహూ రాగాలు తీస్తూ నా దరిచేరారు….
ఏంటి సంగతి మీరు కోయిలమ్మలలా
కుహూ కుహూ
రాగాలు తీస్తారా?
ఆ నీలవర్ణ పక్షి లా
ఎగురుతారా?
                అనగానే
                            
అమాయకపు మెఖాలతో గొల్లున నవ్వారు…!!

అది ప్లవనామ ఉగాది స్వాగతమని 
నేను చెప్పకనే చెప్పా!!! 
కుహూ కుహూ కోయిల రాగాల కేరింతలు
తెలుగు వారి సంవత్సరాది ఉగాది స్వాగత మని
సప్త వసంతాల షడ్రుచుల ఉగాది పచ్చడి
నాలుగు కాలాల  జీవిత సుఖదుఃఖాల కలబోతే…
అని చెప్పకనే చెప్పాను……!!!
లేత చిగురుటాకుల చిగుళ్ళు
మామిడాకుల తోరణాలు
తీరొక్క పూల పరిమళాలు..!!
తెలుగింటి పులిహోర పాయసం..
గుమగుమలు జ్ఞాపకాల దారుల్లో..
పట్టుపరికిణీలు ఆడపిల్లల నవ్వుల
కళకళలు సెలయేరంటి గలగల నవ్వులు!!

సాయంసంధ్య వేళలో పంచాంగ పఠనం..
దైవసన్నిధిలో
అయ్యవారి నోటివెంట ఆదాయ వ్యయాలు..
పెళ్లి పేరంటం.. కొత్తదనం తెచ్చిపెట్టే ఆశల నెలవులు
ఒక్కటేమిటి కోటి ఆశలతో పంచాంగ పఠనము
ప్లవనామ ఉగాదికి స్వాగతం సుస్వాగతం….!!!
"కరోనా" వంటి ఎన్ని మహమ్మారులు ఎదురైనా భారతీయ
సంస్కృతి సాంప్రదాయాల తెలుగు సంవత్సరాది జాబే షడ్రుచుల మేళవింపే ఈ ఉగాది!!!!

కామెంట్‌లు