కొమ్మలకు చిగురు వేసినట్లు
కొత్త ఉగాది వస్తోందంటే చాలు
నాలో నూతన ఊహల సవ్వడి మొదలు
మంచి మంచి నిర్ణయాల ప్రోది ప్రారంభం
చెడును చేదులా దూరం పెట్టాలని
సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలని
తీపి అనురాగాన్ని గుండెలకు హత్తుకోవాలని
అనుబంధాలని వీడని జ్ఞాపకాలుగా మిగుల్చుకోవాలని
కారంగా మిగిలే మమకారం అసలే వద్దని
హద్దులు లేని సహకారాన్నే తోడు నీడగా నిలుపుకోవాలని
వగరు సంఘటనలని రబ్బరుతో తుడిచేసినట్లు
జీవితంలో సమాధి చెయ్యాలని
ఉప్పులా నలుగురితో కలిసి పోతూ
మానవత్వానికి అర్థంలా మారాలని
మరి ఇవన్నీ ఈ కలియుగంలో దొరకట్లేదుగా
దొరకనివి దొరక పుచ్చుకోవటమేగా అందల మెక్కటమంటే
మీరూ నా దారిలోనే పయనిస్తారుగా!
కొత్త ఉగాది వస్తోందంటే చాలు
నాలో నూతన ఊహల సవ్వడి మొదలు
మంచి మంచి నిర్ణయాల ప్రోది ప్రారంభం
చెడును చేదులా దూరం పెట్టాలని
సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలని
తీపి అనురాగాన్ని గుండెలకు హత్తుకోవాలని
అనుబంధాలని వీడని జ్ఞాపకాలుగా మిగుల్చుకోవాలని
కారంగా మిగిలే మమకారం అసలే వద్దని
హద్దులు లేని సహకారాన్నే తోడు నీడగా నిలుపుకోవాలని
వగరు సంఘటనలని రబ్బరుతో తుడిచేసినట్లు
జీవితంలో సమాధి చెయ్యాలని
ఉప్పులా నలుగురితో కలిసి పోతూ
మానవత్వానికి అర్థంలా మారాలని
మరి ఇవన్నీ ఈ కలియుగంలో దొరకట్లేదుగా
దొరకనివి దొరక పుచ్చుకోవటమేగా అందల మెక్కటమంటే
మీరూ నా దారిలోనే పయనిస్తారుగా!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి