ఉగాది;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆంధ్రులను ఆహ్లాదపరిచే  మొదటి పండుగ రోజు ఉగాది  పర్వదినం  ప్రతి ఇంట శోభను చేకూర్చేది  ఈ శోభ కృత్ ఉగాది. ప్రతి ఆంధ్రుడు ఈరోజు కోసం  ప్రతి సంవత్సర ఎదురుచూస్తూనే ఉంటాడు  పిల్లలకు పెద్దలకు కూడా ఇది ఎంతో  ఆనందమయ మైన రోజు  ఉదయం తొందరగా లేచి  అభ్యంగన స్నానం చేసి  పూజా కార్యక్రమాలు ముగించి ముందుగా  షడ్రుచులతో కూడిన  ఉగాది పచ్చడి  తినడం పరిపాటి. కొత్త బట్టలు ధరించి, బంధువులు స్నేహితులు అంతా కలిసి సమష్టి గా చేసుకునే పండుగ  చాలామంది యుగాది అనే శబ్దాన్ని కూడా వాడతారు. అయితే అది ఏ యుగానికి  (నాలుగు యుగాలలో) ఆరంభమో ఎవరు చెప్పడం లేదు అదీ కాక యకారం సంస్కృత శబ్దంతో కూడింది  ఉగాది అంటే ఉకారమునకు ఆది. పెరుగుదలకు ప్రారంభము అని అర్థం అచ్చ తెలుగు పదం. ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల  ప్రతి జీవికి  కష్టాలు నష్టాలు బాధలు చింతలు అనేకం  జీవితంలో ఎదురవుతూ ఉంటాయి  అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి నిల్చి గెల్చిన సత్కీర్తి నెగడు గాక  దవ్వు దవ్వుల నిట్లెయినా నవ్వరిట్లు  అని విరాటపర్వంలో  అర్జునుడు చెప్పిన వాక్యం భారతంలో తిక్కన గారి రచన  కనుక ఈ కష్టం వచ్చింది ఈ బాధ భరించవలసి వచ్చింది అని  మనసంతా  వికలాం చేసుకుని  ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం కన్నా  ధైర్యంగా నిలిచి గెలవాలి అని ఈ ఉగాది మనకు చెప్పే పండుగ లక్షణం. ఈ ఉగాది పచ్చడి దానిలో ఆరు రుచులు ఉన్నాయి. తీపి ఉంది, చేదు ఉంది, వగరు ఉంది అలా అని రుచు చూడడం మానుకుంటామా ? చిన్నపిల్లల అయితే మరీ ఎగబడుతుంటాడు  పెద్దలు కూడా అంతే  జీవితంలో మనకు ధైర్యాన్ని చెప్పే ఏకైక పండుగ ఉగాది. వాతావరణం కూడా చలి నుంచి వీడికి వస్తాం  ఈ సమయంలోనే ప్రతి చెట్టు  పచ్చగా పెరిగి పూలతో కాయలతో పండ్లతో  చూడముచ్చటగా ఉంటుంది. చక్కటి వాతావరణంలో  అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ  జీవితాన్ని ఆనందమయం చేసుకో  అని చెప్పకనే చెప్పే పండుగ ఉగాది  విరోధులను సైతం  ఏకం చేసి తిరిగి వారి మైత్రిని  పెంచే కాలం పిన్నలు, పెద్దలు అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ  పండుగ వాతావరణం  అందంగా ఆస్వాదిస్తూ  అమ్మ చేసిన వంటకాలను  చక్కగా రుచి చూస్తూ  అందరూ ఒకే చోట కూర్చుని  ఆ పదార్థాలను  హాస్యోక్తుల మధ్య  ఆస్వాదిస్తూ ఉంటే  అంతకుమించిన ఆనందం స్వర్గం  వేరే ఏదైనా ఉంటుందా  అందుకే ఆంధ్రులకు ఇష్టమైన పండుగ  ఈ ఉగాది పండుగ  ఈ సందర్భంగా  అందరికీ శుభాకాంక్షలు  అందిస్తూ....



కామెంట్‌లు