బంగారం ఒకటే;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నేడే కాదు ఏనాడైనా  బంగారానికి ఉన్న విలువ మరి దేనికీ లేదు  అది ఎంత ఎక్కువ ఉంటే  ఆ వ్యక్తికి అంత ఎక్కువగా గౌరవం లభిస్తుంది. ఎంత డబ్బు ఉన్నది అని కాకుండా  ధరించిన నగలు బంగారపువి  ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తే వారు  పేదవారు తన వివాహానికి పసుపు కొమ్ము  కట్టిన  పసుపు తాడుతో కాలక్షేపం చేస్తే  ప్రక్కవారు ఒకటి రెండు ఆభరణాలలతో ఉంటారు  ఇంకొకరు ఇంకొన్ని  ఎక్కువ ఆభరణాలు ధరిస్తూ ఉంటారు.  స్వయంకృషితో  కడుపు నింపుకుంటున్న  వ్యక్తులు అతి తక్కువ బంగారంతో  తాళిబొట్టు చేయించుకుంటారు  అతి తక్కువలో చేయించుకున్న వారు చేసిన పరిణాలైనా అత్యధికంగా గంగిరెద్దులాగా వేసుకున్న  ఆభరణాలు అయినా దేనితో తయారు చేస్తారు అంటే ఎవరైనా బంగారంతో అని సమాధానం చెబుతారు అది మూల పదార్థం కనుక సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు  ధనికులు బీదలు  మధ్యతరగతి వ్యక్తులు  ధనికులు ఎక్కువగా  పెద్దపెద్ద హోటళ్లకు వెళ్లి  అతి ఖరీదైన భోజనాలు చేయడానికి ఇష్టపడతారు  సామాన్యమైన వాటికి  అవి ఎంత రుచికరంగా ఉన్నా  అక్కడకు వెళ్లడానికి నామోషి  గా భావిస్తారు  సామాన్యునికి  ఎప్పుడో అత్యవసరం వస్తే తప్ప  చిన్న చిన్న  హోటళ్ళలో తినడం కన్నా  ఆహార పదార్థాలు అమ్మే బండి దగ్గరకు వెళ్లి  తమకు కావలసినవి తెచ్చుకుంటారు. దానికి కూడా నోచుకోని  అతి బీద వారు  నాలుగు ఇళ్లలో  యాచన చేసి ఆకలి బాధ తీర్చుకుంటారు. ఎవరు ఎక్కడ ఏ రకమైన ఆహారం తీసుకున్న  తన కడుపు నింపుకొని నాలుగు రోజులు ఎక్కువ బ్రతకడం కోసం పడే తాపత్రయం. ఆ తినేది ఎక్కడైనా  ఏ వ్యక్తికైనా ఉండేది ఆకలి ఒక్కటే  అని గమనించాలి.
మనిషి జన్మకు కారణం తల్లి తండ్రి  తల్లి క్షేత్రమైతే తండ్రి బీజం అవుతాడు  ఆ పుట్టిన  రోజులు గడుస్తున్న కొద్ది బిడ్డ పెరిగితాడు.  పెద్దవాడు అవుతాడు. ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి జీవి ఒక రకంగా ఉండరు  ఒకరు నల్లగా ఉంటారు మరొకరు తెల్లగా ఉంటారు  మరొకరు  ఎర్రగా ఉంటారు మరి కొందరు సామాన్య చాయగా ఉంటారు.  తల్లిదండ్రులు  ఏ ఆకారాన్ని ఇస్తే ఆ ఆకారంలో ఈ మానవ జన్మ పెరుగుతూ ఉంటుంది తప్ప  ఈ రంగులన్నీ అతను కోరుకున్నది కావు  కానీ మనిషి ఏ రంగులో  ఏ పద్ధతిలో పెరుగుతూ ఉన్నా  దానిని దేహము అని అంటారు తప్ప  మరొక పేరుతో పిలిచే అవకాశమే లేదు  కనుక ఈ భేదాలను గమనించినట్లయితే  మానవుల రోజు ప్రయాణం రావడానికి అవకాశం ఉండదు  అని తీర్మానిస్తున్నాడు వేమన. తన జీవిత అనుభవంతో  వారు రాసిన ఆటవెలదిని చదవండి.

"పని తొడవులు వేరు బంగారమొక్కటి  పరగ ఘటలు వేరు ప్రాణమొకటి  యరయ తిండువేరు యాకలియొక్కటి..."


కామెంట్‌లు