జననేత- వై.ఎస్.ఆర్;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 1963  మే 29వ తేదీన నా వివాహం  మరో వారం రోజుల్లో మా అధికారి శ్రీ వాత్సవ గారు నన్ను పిలిచి సంప్రదించి నిన్ను కడుపు పంపిస్తున్నాను ఆరు నెలలు అక్కడ పని చేయు  తర్వాత వెంటనే నిన్ను మళ్ళీ విజయవాడ తీసుకువచ్చే పూచి  నాది  నీవు రాగానే నిన్ను  ప్రభుత్వ ఉద్యోగిగా  చేస్తాను అని మాట ఇచ్చి నా చేతికి కాగితాలు ఇచ్చారు  ఆ రాత్రి నేను కడప బయలుదేరి వెళ్లి ఉదయం  కేంద్రానికి వెళ్లాను  రెండు రోజులు  లాడ్జి లో ఉన్నాను  రోజు.
కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు  నాలుగు గంటలకు ఆఫీస్ కారు వచ్చి నన్ను తీసుకొని వెళ్లి తిరిగి  కార్యక్రమాలు పూర్తయిన తర్వాత లాడ్జిలో దించేది. రెండు రోజుల్లో నాకు ఇల్లు దొరకడం  మా నాన్న మా శ్రీమతిని మా అమ్మని  తీసుకుని కడప రావడం  ఆరోజు ఆనందంగా  గడిపి తెల్లవారి నాన్న  మళ్లీ విజయవాడ రావడం జరిగింది  నేను అక్కడ చేరిన తర్వాత  అంతకు ముందు విజయవాడ కేంద్రంలో పనిచేసిన గుర్రం కోటేశ్వరావు గారు  కొత్తగా  వచ్చిన అధికారి  భద్రవ్రత గారు  అంతకుముందే పరిశీలన ఇంజనీర్ సత్యనారాయణ గారు  అందరితో పరిచయాలు అయినవి  కార్యక్రమాలు చేయడంలో  చేరిన రెండు మూడు రోజులకే  అందరికీ మంచి అభిప్రాయం ఏర్పడింది
దాదాపు అన్నీ కార్యక్రమాలు  పరిచయాలు నాటకాలు  రూపకాలు  అన్ని నేను చేస్తూ ఉండేవాడిని  కొన్ని రోజులు అయిన తర్వాత  పులివెందల నుంచి ఒకాయన  కార్యక్రమం ఇవ్వడానికి వచ్చి  నన్ను పరిచయం చేసుకున్నాడు  అతను చెప్పదలుచుకున్న విషయాలను వెంటనే ప్రశ్నల ద్వారా రాబట్టి  కార్యక్రమం చక్కగా వచ్చే ఏర్పాటు చేశాను  ఆయన వెళుతూ ఆనంద్ గారు  మీరు ఈ ప్రాంతానికి కొత్త  ఎక్కడ ఆహారాలు కానీ ఆచార వ్యవహారాలు గాని  అలవాటు పడటానికి మీ కొంత సమయం పడుతుంది  మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా  నాకు చెప్పండి అని వారి నంబరు నాకు ఇచ్చారు. ఇక్కడ అన్న  డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు  మాకు ఎవరికీ ఏ సహాయం కావాల్సిన వారే చేస్తారు  వారితో నేను అన్ని ఏర్పాట్లు చేయిస్తాను.

కామెంట్‌లు