పరమేశ్వరుని లీలా విలాసము; - శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
 🪷 పరమేశ్వరుని యొక్క 
లీలా విలాసమే 
      ఈ ప్రపంచ మంతయు! 
ఆత్మ బంధువు లార! 
🪷 "ఓడలే బళ్ళు" యగు 
"బళ్ళులే ఓడలు" యగు 
      శాంభవీ విలాసమిది! 
ఆత్మ బంధువు లార! 
       ( ఆత్మ బంధు పదాలు., శంకర ప్రియ.,)
👌పరమేశ్వరుడు.. సర్వశక్తి సంపన్నుడు! అఘటనా ఘటన సమర్ధుడు! ఆ మహాదేవుని మాయాశక్తి స్వరూపిణియే శాంభవి! మహామాయా శక్తి ప్రభావమే ...ఈ చరాచర ప్రపంచమంతా వ్యాపించి యున్నది! అది.. ఊహాతీత మైనది! పరమేశ్వరుడు, మరియు, పరమేశ్వరి.. ఒక్కరే! వేర్వేరు కాదు! 
       "శాంభవి" మాయాశక్తి వైభవమును ... క్రీ.శ. 16 వ శతాబ్దo వాడిన "బల్లాల దేవుడు" అనే కవీశ్వరుడు.. “భోజ ప్రబంధం” గ్రంథము పేర్కొన్నారు! అందులో.. పరమేశ్వరుని యొక్క లీలా వైభవమును, ఈ విధంగా అభివర్ణించారు 
 
 👌పరమేశ్వరుని యొక్క ఇచ్ఛామాత్రముచే.. సముద్రము.. భూమి స్థలముగాను, భూమి స్థలము.. సముద్రము గాను మారుతుంది. ధూళికణము (ఇసుక రేణువు ).. పర్వతము గాను, మేరుపర్వతము..  ఇసుక రేణువుగాను మారుతుంది! 
        తృణము అనగా గడ్డి పరక.. వజ్రముగాను, వజ్రము.. తృణముగాను మారుతుంది! అగ్ని జ్వాల.. చల్లని మంచుగాను, చల్లని మంచు..వేడి అగ్నిగాను మారుతుంది! 
       పరమేశ్వరుని యొక్క లీలల ద్వారా విషమమైన పరిస్థితులు..  ఆశ్చర్యకర మైన సంఘటనలుగా మారుతున్నాయి! అటువంటి  "దేవ దేవుడు", "మహా దేవుడు" అయిన పరమేశ్వరునకు.. రెండు చేతులను జోడించి, నమస్కరించు చున్నాను! అని, మనమంతా మహా దేవుని భక్తిశ్రద్ధలతో ధ్యానించాలి! అదే విధంగా "పరమేశ్వరుని లీల వైభవ మును" దర్శించాలి! 
  ⚜️ఈ శ్లోక రత్నమును భక్తి శ్రద్ధలతో చదవండి! 
  🪷అంబోధి స్థలతాం, స్థలం జలధితాం, ధూలీలవః శైలతాం, 
      మేరు ర్మత్కుణతాం తృణం కులిశతాం, వజ్రం తృణప్రాయతాం, 
         వహ్నిః శీతలతాం, హిమం దహనతా, మాయావతి యస్యేచ్ఛయా
        లీలా దుర్లలితాద్భుత వ్యసనినే దేవాయ తస్మై నమః!!
       🚩సీస పద్యము   
      ఎవ్వాని తలపున నెండి, సముద్రము.. స్థలమగు, స్థలమంత.. సంద్ర మగును,
        ధూళికణంబంత.. శైలమగుచు నుండు, మేరుపర్వతమగు.. మృత్కణంబు,
        గడ్డిపరకయంత.. గండుఱాయిగ మారు, వజ్రంబు మారును.. పరక వోలె,
      హిమరాతియగు.. నంత హేమ స్వభావంబు,నీహారమగు గాదె.. నిప్పు కణిక,
           🚩తే.గీ. 
        అఘటిత ఘటనా సృష్టించే హర్షమొందు
       అద్భుతాశ్చర్య విషమ మార్గాదు లందు
       తా స్వభావము ప్రకటించు దనివిదీర
      అట్టి దేవ దేవుని కెప్డు నంజలింతు.
      ( తెలుగు సేత: తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.,) 

కామెంట్‌లు