కవితా సుమాంజలి; - శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
       కవితా! ఓ కవితా!
    నమః సుమాంజలి నీకు! 

    జన "చైతన్య"మే నీవు!
    "చైతన్య శక్తి"యే నీవు!
      
    నిద్రాణమై యున్న జాతిని
   "జాగృతి"ని కావించు
  "అరుణోదయ"మే నీవు!

    ఉదయించు సూర్యుని వలె
    దివ్య కాంతుల నొసంగు
    "విజ్ఞాన" తేజమే నీవు!
                
     కవితా! ఓ కవితా,!
     నమః సుమాంజలి నీకు!

     "శుభలేఖ.. ప్రేమలేఖ"..
     "పొలి కేక.. కెవ్వు కేక"..
    ...మున్నగునవి, కవితా వస్తువులు 
     నవరస భరితములు
     సకల మానవాళికి!
      
     "అవిద్య" చీకటిని
      చీల్చి చెందాడెడు
     "జ్ఞాన" ఖడ్గమే నీవు!

     కవితా!  ఓ కవితా!
     నమః సుమాంజలి నీకు!
        🪷 🪷 🪷🪷

కామెంట్‌లు