శోభకృతు;- :డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.9948285353

 షడ్రుచుల సమ్మేళనం
కోకిలల నవవసంత గానం
మామిడికొమ్మల మాటున
దాగిన కొత్తదనం.
పంచాంగ శ్రవణాల సుభోగం
యుగానికి తొలిరోజు స్వాగతం
రాశుల భవితకు చదివిన సంరంభం
శోభకృతు నామ సంవత్సరం.
కొంగొత్త ఆశలకు,
కోటి ప్రణాళికలకు,
సరికొత్త సంవత్సర ప్రారంభం.
చైత్రానికి కాలమద్దిన కొత్త చిత్రం.
శుభాలకు,విజయాలకు 
నాందీ-ప్రస్తావనం.
మానవజీవన పయనానికి
ప్రతిసంవత్సరపు మార్గదర్శనం.
 
కామెంట్‌లు